- జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల కోసం..
- సంగారెడ్డిలో ఉచిత వైద్య శిబిరం ఘనంగా నిర్వహణ
- ముమ్మరంగా సాగిన గుండె, న్యూరో, ఆర్థో ప్రత్యేక పరీక్షలు..
- ఉచితంగా మందుల పంపిణీ
- ఒత్తిడిని జయించి జర్నలిస్టులు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని..
- జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పిలుపు
సంగారెడ్డి, న్యూస్ పేజ్:
జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల కోసం సంగారెడ్డిలో బుధవారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం అత్యంత విజయవంతం అయ్యింది. నిత్యం విధి నిర్వహణలో భాగంగా తీవ్ర పని ఒత్తిడిలో ఉండే జర్నలిస్టులు ఇలాంటి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పిలుపునిచ్చారు. ప్రెస్ క్లబ్ ప్రతినిధులు, విలేఖరులు ఎంతో బాధ్యతాయుతంగా ఈ శిబిరాన్ని నిర్వహించడాన్ని ఆయన అభినందించారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే, కుటుంబ సంక్షేమాన్ని కూడా మంచిగా చూసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు.
జర్నలిస్టుల సంక్షేమానికి ఐక్య పోరాటం..
ఈ హెల్త్ క్యాంప్‌ను స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్, టీయూడబ్ల్యూజే (ఐజేయూ) సంగారెడ్డి జిల్లా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందుకు సంగారెడ్డి సన్‌రైజ్ హాస్పిటల్, రథ సారథి దినపత్రికలు పూర్తి సహకారాన్ని అందించాయి. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.ఎ. ఖాదర్ ఫైసల్ మాట్లాడుతూ.. తమ యూనియన్ రాష్ట్ర శాఖ గతంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించిందని, అదే స్ఫూర్తితో జిల్లా జర్నలిస్టుల శ్రేయస్సు కోసం ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి మాట్లాడుతూ.. రాష్ట్ర నాయకత్వం స్ఫూర్తితో జిల్లాలో జర్నలిస్టుల సంక్షేమానికి, వికాసానికి అనేక కార్యక్రమాలను చేపడుతున్నామని అన్నారు. స్మాల్ అండ్ Medium పేపర్స్ అసోసియేషన్ ఎంతో గొప్ప ఆలోచనతో ఈ శిబిరాన్ని తలపెట్టిందని, అందుకు సహకరించిన సన్‌రైజ్ హాస్పిటల్, రథసారధి పత్రిక యాజమాన్యాలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం నెలకొన్న క్లిష్ట పరిస్థితుల్లో జర్నలిస్టులు నిత్యం అనేక ఒత్తిళ్లకు గురవుతున్నారని, అందువల్ల ప్రతి ఒక్కరూ తరచుగా వైద్య పరీక్షలు నిర్వహించుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. స్మాల్ అండ్ మీడియం అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ సిద్దిఖ్ మాట్లాడుతూ.. జర్నలిస్టుల ఆరోగ్యమే ప్రధాన లక్ష్యంగా ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు. జర్నలిస్టులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనడం సంతోషకరమన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ చౌహాన్ మాట్లాడుతూ.. నిర్వాహకులతో పాటు ప్రతి ఒక్కరు బాధ్యతగా సహకరించడం వల్లే ఈ కార్యక్రమం విజయవంతం అయ్యిందని హర్షం వ్యక్తం చేశారు.
అత్యాధునిక పరీక్షలు.. ఉచిత మందుల పంపిణీ:
జిల్లా ప్రధాన కార్యదర్శి రుమాండ్ల అనీల్ కుమార్ మాట్లాడుతూ.. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు జరిగిన ఈ శిబిరంలో సన్‌రైజ్ ఆసుపత్రికి చెందిన నిపుణులైన వైద్యులు పాల్గొన్నారని తెలిపారు. గుండె వైద్యులు, మధుమేహం, ఎముకలు, మెదడు, నాడీ సంబంధిత వ్యాధులు, చిన్నపిల్లలు, మహిళల ప్రత్యేక విభాగాలతో పాటు సాధారణ వైద్య విభాగాల నిపుణులు రోగులను క్షుణ్ణంగా పరీక్షించి తగిన వైద్య సలహాలు అందించారని చెప్పారు. వివిధ రకాల వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించడంతో పాటు అందుబాటులో ఉన్న మందులను కూడా ఉచితంగా పంపిణీ చేశారు. జిల్లాలోని ప్రింట్, ఎలక్ట్రానిక్, చిన్న, పెద్ద దినపత్రికలు, కేబుల్ మీడియా మరియు సామాజిక మాధ్యమాల ప్రతినిధులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు.
విశిష్ట అతిథుల సమక్షం.. విలేఖరుల హాజరు:
ఈ శిబిరంలో డి పి ఆర్ ఓ విజయలక్ష్మి, అడిషనల్ డిపిఆర్ఓ ఏడుకొండలు, టి ఎన్ జీ ఓ సంఘం జిల్లా అధ్యక్షుడు జావిద్, ప్రధాన కార్యదర్శి రవికుమార్ ఇతర నేతలు కసిని శ్రీకాంత్, వెంకట్ రెడ్డి, యాదవ రెడ్డి పాల్గొని నిర్వాహకులను అభినందించారు. అలాగే సన్‌రైజ్ హాస్పిటల్ అధినేత స్వామి గౌడ్, రథసారధి ఎండి సంతోష్ గౌడ్ లతో పాటు సాక్షి సీనియర్ స్టాఫ్ రిపోర్టర్ బాల ప్రసాద్, ఆంధ్రప్రభ సీనియర్ స్టాఫ్ రిపోర్టర్ రాజు, జిల్లా అక్రిడేషన్ కమిటీ సభ్యుడు ప్రభాకర్ పాల్గొన్నారు. వీరితో పాటు టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా ఉపాధ్యక్షుడు మతీన్, మల్లేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ విల్సన్, ఎలక్ట్రానిక్ మీడియా విభాగం జిల్లా అధ్యక్షుడు ఆసిఫ్, కోశాధికారి సిద్ధూ జైన్ పాల్గొన్నారు. స్మాల్ అండ్ మీడియం పేపర్స్ అసోసియేషన్ జిల్లా కోశాధికారి లక్ష్మణ్, ఉపాధ్యక్షుడు నజీర్, టీయూడబ్ల్యూజే (ఐజేయూ) నేతలు హిమాయత్, ఇర్షాన్, రాజేశ్వర్, దినేష్ నాయక్, శ్రీకాంత్, మహేష్ గౌడ్, కొండాపూర్ రమేష్ గౌడ్ తదితరులు క్షేత్రస్థాయి నుంచి పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Tags: Newspage, Sangareddy News, Journalists Free Medical Camp, Collector Prateek Jain, Sunrise Hospital Sangareddy, TUWJ IJU Sangareddy, Small and Medium News Papers Association


మమ్మల్ని ఫాలో అవ్వండి