- సంగారెడ్డి పట్టణంలోని సన్‌రైస్ హాస్పిటల్ పక్కన..
- నూతనంగా 'దావత్ రెస్టారెంట్' ప్రారంభం
- ప్రత్యేక ఫ్యామిలీ సెక్షన్లు, బర్త్ డే సెలబ్రేషన్స్ హాల్‌తో
- సర్వాంగ సుందరంగా రెస్టారెంట్ రూపకల్పన
సంగారెడ్డి పట్టణం, న్యూస్ పేజ్:
సంగారెడ్డి పట్టణంలోని సన్‌రైస్ హాస్పిటల్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన 'దావత్ రెస్టారెంట్' రెండో బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంగారెడ్డి ఎమ్మెల్యే కాంటెస్టెడ్ అభ్యర్థి, కాంగ్రెస్ నేత పులిమామిడి రాజు ముఖ్య అతిథిగా హాజరై, రెస్టారెంట్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా దావత్ రెస్టారెంట్ మేనేజ్‌మెంట్ ప్రతినిధులు వడ్ల బింబాధర్ చారి, రమేష్, సంగమేశ్వర్లను పులిమామిడి రాజు శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందించారు.
నాణ్యమైన ఆహారంతో ప్రజల ఆదరాభిమానాలు పొందాలి..
అనంతరం పులిమామిడి రాజు మాట్లాడుతూ, దావత్ రెస్టారెంట్ యాజమాన్యం తొలుత సదాశివపేటలో మొదటి బ్రాంచ్‌ను ఏర్పాటు చేసి, ప్రస్తుతం సంగారెడ్డిలో రెండో బ్రాంచ్‌ను విజయవంతంగా ప్రారంభించడం అభినందనీయమన్నారు. వ్యాపార రంగంలో క్రమంగా అభివృద్ధి సాధిస్తూ, వినియోగదారులకు నాణ్యమైన ఆహారాన్ని అందించి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఆకాంక్షించారు. సంగారెడ్డి ప్రజలు ఫ్యామిలీతో విచ్చేసి భోజనం చేసేందుకు వీలుగా ప్రత్యేక సెక్షన్లను, బర్త్ డే వేడుకలు చేసుకునేందుకు చక్కటి హాల్ ను ఏర్పాటు చేసిన యాజమాన్యాన్ని అభినందిస్తూ, ఈ అవకాశాన్ని నియోజకవర్గ ప్రజలందరూ వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూర్ సర్పంచ్ వడ్ల నిఖిత బింబాధర్ చారి, కాంగ్రెస్ నాయకులు, పీఎంఆర్ కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags: Newspage, Sangareddy News, Dawat Restaurant Sangareddy, Pulimamidi Raju PMR, Restaurant Grand Opening, Sangareddy Congress Leaders

మమ్మల్ని ఫాలో అవ్వండి