- సంగారెడ్డి నియోజకవర్గంలో పలు శుభకార్యాలకు హాజరైన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
- కంబాలపల్లి, రెజింతల్ గ్రామాల్లో పర్యటన..
- పెళ్లి వేడుకల్లో కుటుంబ సభ్యులతో ఆత్మీయ మమేకం
సంగారెడ్డి, నవంబర్ 04 న్యూస్ పేజ్ :
సంగారెడ్డి నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో జరిగిన వివాహ మరియు శుభకార్య వేడుకల్లో సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ పాల్గొని సందడి చేశారు. ఆయా వేడుకలకు విచ్చేసిన ఎమ్మెల్యే, నూతన జీవితంలోకి అడుగుపెడుతున్న వధూవరులను ఆత్మీయంగా పలకరిస్తూ వారిని ఆశీర్వదించారు. శుభకార్యాలు జరుగుతున్న ఇళ్లలోని కుటుంబ సభ్యులతో కాసేపు ముచ్చటించి, వారికి తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజాప్రతినిధిగా నిరంతరం ప్రజల్లో ఉండే ఆయన, ఈ విధంగా స్థానికుల ఇళ్లలో జరిగే వేడుకల్లో పాలుపంచుకోవడంపై నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పర్యటన వివరాల్లోకి వెళితే.. మొదటగా సదాశివపేట మండలంలోని కంబాలపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త యాదయ్య కుమార్తె కుమారి నిశ్చితార్థ మహోత్సవానికి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అక్కడ కాబోయే నూతన వధూవరులను దీవించారు. ఆ తర్వాత రెజింతల్ గ్రామంలో మాజీ ఎంపీటీసీ మన్నె భాస్కర్ కుటుంబంలో జరిగిన వివాహ వేడుకకు హాజరై, పెళ్లి కుమార్తె-పెళ్లి కుమారులను ఆశీర్వదించి వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. ఈ పర్యటనలో ఎమ్మెల్యే వెంట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధీర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు పెద్దగళ్ల ఆనందయ్య, పట్టణ అధ్యక్షులు చిల మల్లన్న, కంబాలపల్లి మాజీ సర్పంచ్ పెద్దగళ్ల శ్రీహరి, మాజీ ఉపసర్పంచ్ జాని మియా, మాజీ ఎంపీటీసీలు తులారి గాలయ్య, మన్నె భాస్కర్ తదితర ముఖ్య నాయకులు, అనుబంధ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Tags : newspage news, MLA Chinta Prabhakar Functions, Sangareddy Kambalapally Rejintal Weddings, Sadasivapet BRS Leaders Meet

మమ్మల్ని ఫాలో అవ్వండి