- వరంగల్ బ్యాంక్ కాలనీలోని ఎస్ ఆర్ హైస్కూల్ లో ఘనంగా వేడుకలు
- విద్యార్థుల ఆటపాటలతో అదరిన పాఠశాల ప్రాంగణం!
- బతుకమ్మలను అందంగా అలంకరించిన విద్యార్థులు, ఉపాధ్యాయులు
వరంగల్ బ్యూరో, న్యూస్ పేజ్:
వరంగల్ నగరంలోని బ్యాంక్ కాలనీ పరిధిలో గల ప్రముఖ విద్యాసంస్థ 'ఎస్ ఆర్ హై స్కూల్' నందు తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాల ప్రతీక అయిన ముందస్తు బతుకమ్మ సంబరాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. దసరా నవరాత్రుల సంబరాల్లో భాగంగా పాఠశాల ప్రాంగణాన్ని రంగురంగుల పూలతో, సాంప్రదాయ తోరణాలతో అలంకరించారు. ఈ పండుగ వాతావరణంలో విద్యార్థినులు, మహిళా ఉపాధ్యాయులు సాంప్రదాయ దుస్తుల్లో హాజరై బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు.
ప్రకృతి సిద్ధమైన పూల పండుగ..
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్సార్ జోనల్ ఇన్చార్జి శ్రీ రాజేశ్వర్ రెడ్డి హాజరై మాట్లాడారు. తెలంగాణ ఆడపడుచులకు అత్యంత ఇష్టమైన బతుకమ్మ పండుగ విశిష్టతను, మన సనాతన సంప్రదాయాలను ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు. పూర్వకాలం నుండి ప్రకృతిని పూజించే గొప్ప సంస్కృతి మనదని, అడవుల్లో దొరికే రంగురంగుల పూలతో బతుకమ్మను అలంకరించి గౌరమ్మను కొలవడం వెనుక ఉన్న ప్రాధాన్యతను తెలియజేశారు.
యాజమాన్యానికి ప్రత్యేక అభినందనలు..
ఈ రోజు పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి బతుకమ్మలను స్వయంగా అలంకరించి, ఆనందంగా గడిపేలా సహకరించిన యాజమాన్యానికి వారు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వందన, వైస్ ప్రిన్సిపాల్ శైలజ, పీఈటీలు యుగంధర్, షరీఫ్ నాగరాజు. మమత, ఆనంద్ రమణ, రత్నాకర్, శశి కుమార్, వర్షిని, సుమన్ శ్రీనివాస్ రెడ్డి, రత్న కిషోర్, కుమారస్వామి, రెహనా, లక్ష్మీ, సంయుక్త, శ్రీలత, రజిత, అరవింద, కవిత, రహీమున్నీసా, నవనీత, రాధిక, డాన్స్ మాస్టర్ భరద్వాజ్ సార్ లతో పాటు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.
Tags: Newspage, Warangal News, SR High School Bathukamma, Telangana Bathukamma Celebrations, Warangal School Events


మమ్మల్ని ఫాలో అవ్వండి