Ticker

6/recent/ticker-posts

Ad Code

సదాశివపేట అయ్యప్ప మందిరంలో నీ గానమే నా ప్రాణం

  • జన్మ నక్షత్రం వేళ భక్తిశ్రద్ధలతో పడిపూజ!
  • శ్రీ అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రం సందర్భంగా ప్రత్యేక ధార్మిక ఉత్సవాలు
  • అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో 69వ వేదిక భజన కార్యక్రమం

Holy Padi Puja and devotional bhajan program organized at Sadashivapet Ayyappa temple on Lord Ayyappa birth star.

సదాశివపేట, న్యూస్ పేజ్:

పట్టణంలోని శ్రీ అయ్యప్ప మందిరంలో ఆధ్యాత్మిక భక్తిభావం ఉప్పొంగింది. 'నీ గానమే నా ప్రాణము' 69వ వేదిక కార్యక్రమాన్ని పురస్కరించుకొని, శ్రీ అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రం సందర్భంగా శుక్రవారం నాడు ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ ధార్మిక మహోత్సవంలో పలు గ్రామాల భజన మండలి సభ్యులు, గురుస్వాములు మరియు శరణు ఘోషతో అయ్యప్ప స్వాములు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

శాస్త్రోక్తంగా గోపూజ, మహా పడిపూజ..

స్వామివారి జన్మ నక్షత్ర పవిత్ర దినాన్ని పురస్కరించుకొని ఉదయం నుంచే మందిరంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో ధ్వజారోహణం, గోపూజ, అఖండ దీపారాధన మరియు అఖండ దేవత భజన కార్యక్రమాలను వేదోక్తంగా నిర్వహించారు. అనంతరం సాయంత్రం వేళ అత్యంత వైభవంగా స్వామివారి మహా పడిపూజ కార్యక్రమాన్ని పూర్తి చేసి భక్తులకు మహాప్రసాద వినియోగం చేశారు. ఇట్టి కార్యక్రమం పూర్తిగా హిందూ ధర్మ రక్షణ కొరకై, భక్తి చైతన్యాన్ని పెంపొందించేందుకు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ పవిత్ర ఆధ్యాత్మిక కార్యక్రమమునకు శ్రీ కేశవ గురుస్వామి మరియు దేశ్పాండే గురుస్వామి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు గోనె శంకర్ గురుస్వామి, ఉపాధ్యక్షులు సుధాకర్ గౌడ్ గురుస్వామి, గురుస్వాములు ఓదెల రవీందర్, చింత గోపాల్, చెన్నాకర్, విశ్వనాథం, శ్రీనివాస్ మరియు అయ్యప్ప స్వాములు విలాస్, అనంతరెడ్డి, పవన్ గౌడ్, ప్రభు, చెన్నయ్య, జయ చింతన్ తదితరులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.



Tags: Newspage, Sadashivapet News, Ayyappa Temple Padipuja, Nee Ganame Na Pranam Bhajan, Ayyappa Seva Samithi, Sangareddy Bhakthi News