Ticker

6/recent/ticker-posts

Ad Code

శాంతినికేతన్ లో బతుకమ్మ సంబరాలు.. ఆటపాటలతో అదరిన పాఠశాల ప్రాంగణం!

  • బతుకమ్మలను అందంగా అలంకరించిన విద్యార్థులు, ఉపాధ్యాయులు
  • విద్యార్థులకు ప్రత్యేక బహుమతుల ప్రదానం

School girls and teachers playing Bathukamma in traditional attire at Sadashivapet Shantiniketan School.

సదాశివపేట బ్యూరో, న్యూస్ పేజ్:

సదాశివపేట పట్టణంలోని ప్రముఖ విద్యాసంస్థ 'శాంతినికేతన్ విద్యాలయం' నందు తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాల ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. దసరా నవరాత్రుల సంబరాల్లో భాగంగా పాఠశాల ప్రాంగణాన్ని రంగురంగుల పూలతో, సాంప్రదాయ తోరణాలతో అలంకరించారు. ఈ పండుగ వాతావరణంలో విద్యార్థినులు, మహిళా ఉపాధ్యాయులు సాంప్రదాయ దుస్తుల్లో హాజరై బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు.

ప్రకృతి సిద్ధమైన పూల పండుగ..

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల కరస్పాండెంట్ మాలి పటేల్ అరవిందశ్రీ, ప్రిన్సిపల్ సుప్రియ మాట్లాడుతూ.. తెలంగాణ ఆడపడుచులకు అత్యంత ఇష్టమైన బతుకమ్మ పండుగను పాఠశాల వాతావరణంలో జరుపుకోవడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. నేటి కాలంలో బతుకమ్మ అంటే ఒక రెడీమేడ్ పండుగలా తయారైందని, కానీ పూర్వకాలం నుండి ఇది మన ప్రకృతిని ప్రతిబింబించే పండుగని గుర్తుచేశారు. అడవుల్లో దొరికే తంగేడు, గునుగు, చామంతి వంటి అనేక రకాల పూలు, ఆకులతో బతుకమ్మను ఎంతో అందంగా అలంకరిస్తారని వివరించారు. ఆ బతుకమ్మల మధ్యలో గౌరమ్మ తల్లిని పసుపుతో తయారు చేసి ఉంచి, "బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో" అంటూ తమ కుటుంబాలను చల్లగా చూడాలని మహిళలు పాటల రూపంలో వేడుకుంటారని తెలిపారు.

ఈ రోజు పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి బతుకమ్మలను స్వయంగా అలంకరించి, ఆనందంగా గడిపేలా సహకరించిన ఉపాధ్యాయ బృందానికి, యాజమాన్యానికి వారు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులందరికీ బతుకమ్మ మరియు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అందంగా బతుకమ్మలను తయారు చేసుకువచ్చిన విద్యార్థులకు పాఠశాల తరఫున ప్రత్యేక బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



Tags: Newspage, Sadashivapet News, Shantiniketan School Bathukamma, Telangana Bathukamma Celebrations, Sangareddy School Events