- ఉరుసులో నివాళులర్పించిన ప్రముఖులు, వర్తక సంఘం నేతలు!
- రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆర్గనైజేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు దూడం భాస్కర్
వరంగల్ బ్యూరో, న్యూస్ పేజ్ :
జాతర మిఠాయి వర్తకుడు, ప్రముఖ వ్యాపారి కుసం రాజమౌళి గారి ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని వరంగల్ 40వ డివిజన్ ఉరుసులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, కుసం మురళి రమ శీలం భాగ్యలక్ష్మి సత్యనారాయణ కుసం మహేందర్ సునీల్ శ్రీకాంత్ పారిజాతం జాతర మిఠాయి వర్తకులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరై కుసం రాజమౌళి గారి సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులు అర్పించారు.
కార్యక్రమంలో జాతర మిఠాయి వర్తక సంఘం ఆధ్యక్షులు కొండ మోహన్ పాల్గొని కుసం రాజమౌళి గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వరంగల్ జిల్లా బీజేపీ మాజీ
ఉపా అధ్యక్షులు మాచర్ల దీనదయాళ్, మంద బాబురావు, రెడీమార్ రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆర్గనైజేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు దూడం భాస్కర్ తదితరులు కుసం రాజమౌళి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కుసం రాజమౌళి గారు జాతర మిఠాయి వర్తక రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని, వ్యాపార రంగంలో తనతోటి వర్తకులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ అందరితో కలిసిమెలిసి ఉండేవారని గుర్తు చేసుకున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని, ఆయన జ్ఞాపకాలను జాతర మిఠాయి వర్తకులు ఇప్పటికీ స్మరించుకోవడం విశేషమని పేర్కొన్నారు. ప్రథమ
వర్ధంతి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో జాతర మిఠాయి వర్తకులు బూర రాజు, మధు, నాగరాజు, రాకం సారంగం తదితరులు పాల్గొన్నారు. కుసం రాజమౌళి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా జాతర మిఠాయి వర్తకులు మాట్లాడుతూ తమ రంగానికి చెందిన ప్రముఖులను ప్రతి సంవత్సరం స్మరించుకోవడం ద్వారా వారి సేవలను భవిష్యత్ తరాలకు పరిచయం చేయడంతో పాటు, వర్తకుల మధ్య ఉన్న ఐక్యతను మరింత బలోపేతం చేయవచ్చని తెలిపారు. కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో జరిగింది.
Tags : Kusam Rajamouli Vardhanthi, Warangal Urusu Local News, Mithai Merchant Association Meeting, Newspage Telangana Local News

మమ్మల్ని ఫాలో అవ్వండి