Ticker

6/recent/ticker-posts

Ad Code

కన్నుల పండుగగా.. వరంగల్ ఎల్లంబజార్ 51 అడుగుల వరసిద్ధి గణపతి నిమజ్జనం

  • రూ రెండు లక్షల 25 వేల లడ్డు వేలం పాట
  • భక్తుల కో లా హాల మధ్య నిమజ్జనం

Warangal Ellam Bazar 51 Feet Varasiddhi Ganapati Idol Nimajjanam Palabhbasekam Laddu Auction 2026

వరంగల్ బ్యూరో, న్యూస్ పేజ్ :

వరంగల్ మహానగరంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల ముగింపు సంబరాలు భక్తులలో సరికొత్త ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపాయి. వరంగల్ ఎల్లమ్మ బజార్లో  శ్రీ భద్రకాళి హిందూ ఉత్సవ సమితి నిర్వాహకులు ఆకుతోట సంజు ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని 5 1 అడుగుల భారీ వరసిద్ధి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 14 రోజులు ఘనంగా పూజలు, హోమాలు ,అర్చనలు, అభిషేకాలు అందుకున్న బడా గణపతి  ఆదివారం ప్రతిష్టించిన చోటే నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు  .ఆదివారం  వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు,  నిర్వహి0చారు. మొదటగా 51 అడుగుల వరసిద్ధి వినాయక విగ్రహానికి పాలు, , కుంకుమ,  పసుపులతో పాలాభిషేకాన్ని నిర్వహి0చారు. అనంతరం  పంచామృత అభిషేకం నిర్వహి0చారు .పాలు నీళ్లతో నిమజ్జన కార్యక్రమాన్ని గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించిన చోటే  నిమజ్జ0 చేశారు.  నీళ్లలో పాలు కలిపి పైపుతో విగ్రహం మీదికి పంపింగ్ చేయడంతో  విగ్రహ నిమజ్జనం కార్యక్రమం పూర్తయింది.

వేలంపాటలో లడ్డు రు.2,25,000/-

వరంగల్ ఎల్లమ్మ బజార్ లో51 అడుగుల వరసిద్ధి గణపతి విగ్రహం వద్ద ఆదివారం లడ్డు వేలంపాట నిర్వహించారు .లడ్డు రూ రెండు లక్షల 25 వేలకు కాజీపేట కు చెందిన శంకర్, లావణ్య తులసి ,నాగరాజు, దేవిక కుటుంబ సభ్యులు దక్కించుకున్నారు.


Tags  : Warangal 51 Feet Ganesha, Ellam Bazar Ganapati Nimajjanam, Warangal Laddu Auction 2026, Newspage Telangana Devotional News


వరంగల్ ఎల్లం బజార్ 51 అడుగుల భారీ వరసిద్ధి గణపతి నిమజ్జనం ఘనంగా పూర్తి! కాజీపేట భక్తులకు రూ. 2.25 లక్షలకు దక్కిన లడ్డు వేలం పాట పూర్తి వివరాలు