- వీధి దీపాలు, మురికి కాలువలు, పార్కు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి
పట్టణంలోని పదో వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరించి ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్‌రావుకు వార్డు ప్రజల తరఫున వినతిపత్రం అందజేశారు. వార్డులోని పలు ప్రాంతాల్లో వీధి దీపాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, మురికి కాలువల సమస్యతో పారిశుద్ధ్యం లోపిస్తోందని ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. గతంలో ఏర్పాటు చేసిన పార్కులో సరైన వసతులు లేక ప్రజలకు ఉపయోగపడటం లేదని వివరించారు. పార్కును అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.
వార్డులో నెలకొన్న సమస్యలపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసి మౌలిక వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఎంపీని కోరారు. ఈ కార్యక్రమంలో గణపురం చంద్రశేఖర్, బీజేపీ ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షులు, చిప్పా నాగేందర్, విజయ్ కుమార్ స్వామి, మధుసూదన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Tags : newspage news, Sadasivapet 10th ward problems, MP Raghunandan Rao representation, Medak MP civic infrastructure petition, Sadasivapet municipality park development

మమ్మల్ని ఫాలో అవ్వండి