- కాంగ్రెస్ పాలనలో విద్యుత్ కోతలతో ఎండిపోతున్న పంటలు..
- సదాశివపేట మండల బీఆర్‌ఎస్ పార్టి అధ్యక్షుడు పెద్దగొల్ల ఆంజనేయులు డిమాండ్
సదాశివపేట, న్యూస్ పేజ్ :
తెలంగాణ రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో విద్యుత్ కోతలు మళ్లీ మొదలయ్యాయని, దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లోని సాగు రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సదాశివపేట మండల బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు పెద్దగొల్ల ఆంజనేయులు మండిపడ్డారు. రైతులకు నిరంతరాయంగా 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరాను తక్షణమే పునరుద్ధరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సదాశివపేటలో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన మాట్లాడారు. వ్యవసాయ పనులకు కీలకమైన ప్రస్తుత వాతావరణ సమయంలో విద్యుత్ సరఫరాలో గంటల తరబడి అంతరాయం ఏర్పడటం వల్ల పొలాల్లో వేసిన పంటలు ఎండిపోయే ప్రమాదకర స్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు.
గత బీఆర్‌ఎస్ హయాంలో కరెంట్ కష్టాలు లేవు.. సమస్యలు పరిష్కరించకుంటే పోరాటం!
కేసీఆర్ పాలనే ఆదర్శం: గత కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు ఎలాంటి కోతలు లేకుండా ఉచితంగా 24 గంటల నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసిన విషయాన్ని ఈ సందర్భంగా పెద్దగొల్ల ఆంజనేయులు గుర్తు చేశారు. ప్రస్తుతం విద్యుత్ కోతలపై అన్నదాతలు ఎక్కడికక్కడ సబ్‌స్టేషన్ల ముట్టడి చేస్తూ రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయానికి విద్యుత్ కోతలకు తక్షణమే స్వస్తి పలకాలని, లేనిపక్షంలో రైతుల పక్షాన బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేసారు.
Tags : Sadashivpet BRS Leader Anjaneyulu, 24 Hours Free Power Demand Telangana, Telangana Agriculture Power Cuts 2026, Newspage Regional News

మమ్మల్ని ఫాలో అవ్వండి