- కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని శివరాజ్ పాటిల్ మొక్కులు!
- తెలంగాణ ప్రజలు, రైతాంగం సుభిక్షంగా వర్ధిల్లాలి..
- అమ్మవారి సన్నిధిలో గులాబీ నేతల ప్రత్యేక ప్రార్థనలు!
సంగారెడ్డి బ్యూరో, న్యూస్ పేజ్ :
దేశంలోనే అత్యంత మహిమాన్వితమైన శక్తిక్షేత్రంగా విరాజిల్లుతున్న అస్సాంలోని శ్రీ కామాఖ్య దేవి ఆలయంలో బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు శివరాజ్ పాటిల్ పార్టీ ముఖ్య నేతలతో కలిసి వైభవంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల సమక్షంలో శాస్త్రోక్తంగా అమ్మవారికి అభిషేకాలు, విశేష అర్చనలు జరిపించారు. ఈ సందర్భంగా శివరాజ్ పాటిల్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సంక్షేమం దృష్ట్యా బీఆర్‌ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఎంతో అవసరమన్నారు. ప్రజానేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాలని తాము అమ్మవారిని వేడుకున్నట్లు స్పష్టం చేశారు.
• వర్షాలు సమృద్ధిగా కురవాలి.. ప్రజాసేవకు మరిన్ని అవకాశాలు దక్కాలి!
రైతాంగం సుభిక్షంగా ఉండాలి: తెలంగాణ వ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిసి, పంటలు బాగా పండి ప్రతి రైతు కుటుంబం ఆర్థికంగా సుసంపన్నం కావాలని ఆలయంలో ప్రత్యేకంగా ప్రార్థించినట్లు శివరాజ్ పాటిల్ తెలిపారు. భవిష్యత్‌లో నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికి తనకు మరిన్ని ఉన్నతమైన రాజకీయ అవకాశాలు దక్కాలని కూడా అమ్మవారిని కోరుకున్నట్లు వెల్లడించారు.
ఈ ప్రతిష్టాత్మక అస్సాం పర్యటన పూజా కార్యక్రమంలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు అమరేందర్ రెడ్డి, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు విద్యాసాగర్ రెడ్డి, ఇంద్రమోహన్ గౌడ్ పాల్గొన్నారు. వీరితో పాటు మాజీ కో-ఆప్షన్ సభ్యులు కోడూరి అంజయ్య మరియు ప్రేమ్‌చంద్ తదితరులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
Tags : BRS Shivaraj Patil Kamakhya Temple, KCR Next CM Prayers Assam, BRS Sangareddy Leaders Tour, Newspage Regional News

మమ్మల్ని ఫాలో అవ్వండి