Ticker

6/recent/ticker-posts

Ad Code

తుల్జాపూర్ అంబాభవాని అమ్మవారిని దర్శించుకున్న పులిమామిడి మమత రాజు దంపతులు!

  • సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలు.. 
  • మహారాష్ట్రలోని పుణ్యక్షేత్రంలో భారీ అన్నదాన కార్యక్రమం.

Pulimamidi Raju and his wife Mamatha performing special rituals at Tuljapur Bhavani temple in Maharashtra

తుల్జాపూర్,  అక్టోబర్ 17 (న్యూస్ పేజ్) :

దేవి నవరాత్రుల మహోత్సవంలో భాగంగా మహారాష్ట్రలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తుల్జాపూర్‌లో కొలువుదీరిన శ్రీ తుల్జా భవాని అమ్మవారిని సంగారెడ్డి ఎమ్మెల్యే కాంటెస్టెడ్ అభ్యర్థి పులిమామిడి రాజు, ఆయన సతీమణి, సదాశివపేట 12వ వార్డు కౌన్సిలర్ పులిమామిడి మమత రాజు తమ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు రోహిత్ కదం పరమేశ్వర్ ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకం, గోందళం, ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం తుల్జాపూర్‌కు విచ్చేసిన దేశ నలుమూలల భక్తుల కోసం పులిమామిడి రాజు ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా పులిమామిడి రాజు మాట్లాడుతూ.. సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరిపై తుల్జా భవాని అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో జీవించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో రైతులు పంటల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని, రానున్న రోజుల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడాలని అమ్మవారిని వేడుకున్నట్లు వెల్లడించారు.

Pulimamidi Raju and his wife Mamatha performing special rituals at Tuljapur Bhavani temple Annadanam in Maharashtra

రైతులకు సమృద్ధిగా పంటలు పండాలని, పాడిపంటలతో గ్రామీణ ప్రాంతాలు కళకళలాడాలని, సమయానికి తగిన వర్షాలు కురిసి నీటి సంక్షోభం తొలగిపోవాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా భక్తులకు సహాయం చేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో పులిమామిడి రాజు మిత్రులు నర్సింలు, తాలెల్మ రాము, సోమ శంకర్, పీఎంఆర్ యువసేన నాయకులు, వారి కుటుంబ సభ్యులు గాండ్ల పద్మ, మనోజ్, మాధవి, రాణి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

రాజకీయ నాయకులు కేవలం ఎన్నికల వేళ మాత్రమే కాకుండా ఇలా పండగ రోజుల్లో ప్రజల కష్టాలను మనసులో ఉంచుకుని దైవదర్శనాలు చేసుకోవడం అభినందనీయం. నియోజకవర్గ ప్రజల క్షేమాన్ని, రైతాంగం ఎదుర్కొంటున్న వర్షభావ పరిస్థితులను అమ్మవారి దృష్టికి తీసుకెళ్లడం పులిమామిడి రాజు దంపతుల ప్రజా నిబద్ధతకు అద్దం పడుతోంది. పరాయి రాష్ట్రంలో సైతం తెలుగు భక్తులతో పాటు ఇతరుల కోసం అన్నదాన సత్రాలు ఏర్పాటు చేయడం గొప్ప విషయం. ఈ పూజల ఫలితంగా సంగారెడ్డి ప్రాంతంలో సకాలంలో వర్షాలు కురిసి, కరువు పరిస్థితులు తొలగిపోయి ప్రజలందరి ఇళ్లలో సుఖశాంతులు వెల్లివిరియాలని ఆశిద్దాం.


Tags : newspage news, Pulimamidi Raju Tuljapur, Sangareddy Leader Annadanam, Sadasivapet Councillor Mamatha