Ticker

6/recent/ticker-posts

Ad Code

మునిపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా 19 సంవత్సరాలుగా లింగన్నగారి సతీష్ కుమార్

  • ​అప్రతిహత నాయకత్వ ప్రస్థానం.. సరికొత్త చరిత్ర సృష్టించిన సతీష్ కుమార్
  • ​19 సంవత్సరాల సేవా నిరతిని వేనోళ్ల కొనియాడి నియామక పత్రం
  • అందజేసిన మంత్రి దామోదర రాజనర్సింహ
  • ​మంత్రి దామోదర్ సార్‌కు పాదాభివందనాలతో 
  • హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపిన సతీష్ కుమార్

Telangana Minister Damodara Raja Narasimha Appointing Lingannagari Satish Kumar as Munipally Congress President

​సంగారెడ్డి/మునిపల్లి, న్యూస్ పేజ్ :

మునిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పిల్లోడి గ్రామానికి చెందిన ప్రజానేత, కార్యకర్తల ఆశాజ్యోతి లింగన్న గారి సతీష్ కుమార్ మరోసారి నియమితులయ్యారు. గత 19 సంవత్సరాలుగా మునిపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నిరంతరం శ్రమిస్తూ, పార్టీ బలోపేతానికి ఆయన అందిస్తున్న విశేష సేవలను గుర్తించి కాంగ్రెస్ అధిష్టానం తిరిగి అధ్యక్ష బాధ్యతలను ఆయనకే అప్పగించింది. ఒకే మండలంలో మునిపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా 19 సంవత్సరాలుగా నిర్విరామంగా బాధ్యతలు నిర్వర్తించడం ఆయన అంకితభావానికి, తిరుగులేని ప్రజాదరణకు నిదర్శనంగా నిలిచింది.  

​సతీష్ 19 సంవత్సరాల సేవా ప్రస్థానాన్ని ఘనంగా కొనియాడిన మంత్రి దామోదర రాజనర్సింహ:

​రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ దామోదర రాజనర్సింహ గారు శనివారం సతీష్ కుమార్ గారికి స్వయంగా నియామక పత్రాన్ని అందజేసి మనస్ఫూర్తిగా అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ గారు మాట్లాడుతూ ​"గత 19 సంవత్సరాలుగా మునిపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నిరంతరం కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ, పార్టీని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న నిస్వార్థ సైనికుడు లింగన్న గారి సతీష్ కుమార్. క్రమశిక్షణ, కార్యకర్తల పట్ల అంకితభావం కలిగిన నాయకుడు కాబట్టే ఇన్ని సంవత్సరాలుగా నిరాటంకంగా బాధ్యతలు నిర్వర్తించగలుగుతున్నారు. సతీష్ లాంటి నిబద్ధత గల నాయకత్వం పార్టీకి కొండంత బలం" అని మంత్రి దామోదర్ సార్ గారు సతీష్ కుమార్ సేవా ప్రస్థానాన్ని వేనోళ్ల ప్రశంసించారు.

  ​దామోదర్ సార్ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను – లింగన్న గారి సతీష్ కుమార్:

​నియామక పత్రం స్వీకరించిన అనంతరం మునిపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లింగన్న గారి సతీష్ కుమార్ గారు తీవ్ర భావోద్వేగంతో మాట్లాడుతూ ​"నాపై అచంచలమైన నమ్మకంతో మునిపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను తిరిగి అప్పగించిన మన ప్రియతమ నేత, ఆందోల్ ప్రగతి ప్రదాత, గౌరవ మంత్రివర్యులు శ్రీ దామోదర రాజనర్సింహ సార్ గారికి నా పాదాభివందనాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు. నా ఈ 19 సంవత్సరాల అధ్యక్ష ప్రస్థానానికి, నా రాజకీయ ఎదుగుదలకు మంత్రి దామోదర్ సార్ గారి ఆశీస్సులే కారణం. మంత్రిగారి సంపూర్ణ సహకారంతో మునిపల్లి మండలంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తాం. కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా నిలబడి, దామోదర్ సార్ నాయకత్వంలో కాంగ్రెస్ జెండాను మరింత సమున్నతంగా ఎగురవేస్తాను."

  ​ఆందోల్ నియోజకవర్గంలో నూతన మండల అధ్యక్షుల బాధ్యతల స్వీకారం:

​మంత్రి శ్రీ దామోదర రాజనర్సింహ గారి ఆదేశాల మేరకు ఆందోల్ నియోజకవర్గంలోని పలు మండలాలకు నూతన కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నియమితులయ్యారు. పార్టీని నియోజకవర్గంలో మరింత బలోపేతం చేయాలని నూతన నాయకులకు మంత్రి సూచించారు.  

​మునిపల్లి: లింగన్న గారి సతీష్ కుమార్, ​ఆందోల్: గంగాధర్ అశోక్, ​చౌటకూర్: బోడపట్ల గణేష్,​పుల్కల్: మల్లంగారి దుర్గా రెడ్డి, ​రాయికోడ్: పట్లోళ్ల కేదారినాథ్, ​వట్పల్లి: వజినాల విశ్వాస్, ​ఆందోల్-జోగిపేట్ (పట్టణం): డి.జి. వెంకటేశం  ​లింగన్న గారి సతీష్ కుమార్ గారు మునిపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తిరిగి బాధ్యతలు స్వీకరించడం పట్ల మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.


Tags : Munipally Congress Satish Kumar, Damodara Raja Narasimha Congress Leaders, Andole Congress Mandal Presidents List, Newspage Regional News