Ticker

6/recent/ticker-posts

Ad Code

స్వయం ఉపాధితోనే మహిళల ఆర్థిక ప్రగతి: డా. అనితా రెడ్డి

Dr Anitha Reddy Warangal Woman Empowerment

వరంగల్ బ్యూరో, న్యూస్ పేజ్ :

ఎఫ్. ఎం. ఎం సాంఘిక సేవా సంస్థ ఆధ్వర్యంలో  షెడ్యూల్డ్ కులాల హక్కుల అభివృద్ధి సమితి కార్మిక విభాగం రాష్ట్రఅధ్యక్షులు  యమడాల, హను కాంత్ అధ్యక్షతన, కొండపర్తి గ్రామం హన్మకొండ జిల్లాలో మహిళలు టైలరింగ్ కుట్టుమిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న సందర్బంగా  మహిళలకు  సర్టిఫికెట్ అందజేత కార్యక్రమం, అదేవిదంగా నూతనంగా 40 మంది  కొండపర్తి గ్రామం లోని పేద మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది, 


ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు, సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్ కోర్టు మెంబర్, అనురాగ్ సొసైటీ చైర్మన్ డాక్టర్ అనితా రెడ్డి మరియు ఆంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యునిట్ సి. ఐ రమేష్ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ అనితా రెడ్డి మాట్లాడుతూ స్వయం ఉపాధి శిక్షణలు మహిళల ఆర్థికాభి వృద్ధికి ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడతాయని వాటిని వినియోగించుకొని  మహిళలు వారి కాళ్ళపై వారు నిలబడాలని అన్నారు,, మహిళాభి వృద్ధి లోనే దేశాభివృద్ధి దాగి ఉందని, ఒక మహిళ ఆర్ధికంగా ఎదిగితే ఆ కుటుంబం అంతా బాగుంటుందని డాక్టర్ అనితా రెడ్డి అన్నారు, 


చక్కని నైపుణ్యం పొందిన వారికి ప్రభుత్వం లోను సౌకర్యాలు అందిస్తుందని, మహిళా గ్రూపుల సహకారం తో వ్యాపారం మొదలు పెట్టుకొని పైకి ఎదగవచ్చని  డాక్టర్ అనితా రెడ్డి అన్నారు, మహిళా సాధికారత, మహిళల బద్రత  విషయంలో తమ డిపార్ట్మెంట్ ఎప్పుడు ముందుంటుందని, సైబర్ నేరగాళ్ళ వలలో పడవద్దని, అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలని   సి. ఐ రమేష్ అన్నారు అనంతరం అతిథుల చేతులమీదుగా టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికేట్స్ అందజేసారు, కొత్తగా శిక్షణ మొదలు పెడుతున్న వారికి ఉచితంగా టైలరింగ్ మెటీరియల్ అందజేసారు,  


ఈయొక్క కార్యక్రమం లో  డాక్టర్ అనితా రెడ్డి, సి.ఐ రమేష్, ఎఫ్. ఎం. ఎం సాంఘిక సేవా సంస్థ ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఎర్ర శ్రీకాంత్, ప్రాజెక్టు మేనేజర్ కరుణ, అజయ్, హనుకాంత్, వార్డ్ మెంబెర్స్, కట్కూరి, స్వాతి, కట్ట, సంబరాజు, మాజీ సర్పంచ్, కట్కూరి, రాజమణి,తదితరులు పాల్గొన్నారు


Tags : Dr Anitha Reddy, Dr.Anilth Reddy Warangal, Womans Empowerment, NewsPage Daily