హనుమకొండ ప్రతినిధి, న్యూస్ పేజ్ :
సాఫ్ట్ బాల్ క్రీడకు.. ఓరుగల్లును అడ్డాగా తీర్చిదిద్దామని తెలంగాణ రాష్ట్ర సాఫ్ట్బాల్ అసోసియేషన్ చైర్మన్, ఉమ్మడి వరంగల్ జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు, ప్రముఖ వైద్యులు డాక్టర్ పిల్లి సాంబశివరావు తెలిపారు. రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ చాంపియన్షిప్ పోటీలకు ఎంపికైన జిల్లా జట్టు అభినందన కార్యక్రమంను హనుమకొండలోని ఇండోర్ స్టేడియంలో శుక్రవారం మధ్యాహ్నం హనుమకొండ జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ సెక్రటరీ తాబేటి రాజేందర్, ఉపాధ్యక్షులు పెరుమాండ్ల సాంబమూర్తి, జాయింట్ సెక్రెటరీ సుమలత ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం నిర్వహించారు.
ఈ వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉమ్మడి వరంగల్ జిల్లా సాఫ్ట్ బాల్ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించడం అభినందనీయమని కొనియాడారు. ఇలా అంతర్జాతీయంగా, జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో రాణించేలా శిక్షణ ఇస్తున్న కోచ్ పోలేపాక వినయ్ ని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు. క్రీడలతో పాటు చదువులో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. క్రీడాకారులకు దేశంలో.. రాష్ట్రంలో ఉజ్వల భవిష్యత్తు ఉందని స్పష్టం చేశారు. ఆరోగ్యమే మహాభాగ్యమని పాఠశాల స్థాయిలోనే క్రీడలపై మక్కువ పెంచేలా ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు.
అంతకుముందు సెక్రటరీ తాబేటి రాజేందర్, ఉపాధ్యక్షులు పెరుమాండ్ల సాంబమూర్తి మాట్లాడుతూ.. సాఫ్ట్బాల్ క్రీడలో ఉమ్మడి వరంగల్ జిల్లా అడ్డగా మారడానికి అన్ని విధాల అండగా నిలుస్తూ.. క్రీడాకారులకు సహకరిస్తూ.. అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా ప్రోత్సహిస్తున్న తెలంగాణ రాష్ట్ర సాఫ్ట్బాల్ ఆసోసియేషన్ చైర్మన్ డాక్టర్ సాంబశివరావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ప్రకటించారు. నిజామాబాద్ జిల్లాలో రేపటి నుంచి జరుగనున్న సబ్ జూనియర్ రాష్ట్ర స్థాయి చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొంటున్న బాలికలకు మామునూరు సిఐ పూర్ణచందర్ అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో.. కోచ్ పోలేపాక వినయ్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్లు రాజు, కిరణ్మయి, అసోసియేషన్ ప్రతినిధులు తాబేటి నాగరాజు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Tags : Warangal Softball, Softball news, Newspage daily updates

మమ్మల్ని ఫాలో అవ్వండి