- లయన్స్ సేవా సంబరం వేడుకల్లో ఇంటర్నేషనల్.. డైరెక్టర్ ఘట్టమనేని బాబురావు.
- లయన్స్ కార్యక్రమాలను నాబార్డ్ తో సమన్వయం చేస్తా
- చీఫ్ జనరల్ మేనేజర్ ఉదయ భాస్కర్.
- మహిళలకు కుట్టు మిషన్లు, విద్యార్థులకు సైకిల్స్ పంపిణీ
- నేత్రపర్వంగా 11వ క్యాబినెట్ ఇన్స్టాలేషన్.
వరంగల్ బ్యూరో, న్యూస్ పేజ్ :
వి సర్వ్ నినాదంతో అవసరార్థులను ఆదుకుంటున్న లయన్స్ ఇకపై అన్న ప్రసాద వితరణ పై ప్రత్యేక దృష్టి లయన్స్ అంతర్జాతీయ డైరెక్టర్ ఘట్టమనేని బాపూరావు పిలుపునిచ్చారు. ఇప్పటికే మల్టిపుల్ స్థాయిలో 22 వాహనాల ద్వారా లక్షన్నర మందికి అన్న ప్రసాద వితరణ జరుగుతుందన్నారు. ప్రతి మనిషికి ఎన్ని అవసరాలు ఉన్నా ముఖ్యమైన అవసరం ఆహారం అన్నారు. వీలైనంతహంగర్ రిలీఫ్ కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. సమయపాలన పాటిస్తూ, నాణ్యత తో కూడిన సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న 320 ఎఫ్ జిల్లా శాఖ నాయన అభినందించారు. వరంగల్ ఉమ్మడి జిల్లాతో కూడిన 320ఎఫ్ 11వ ఇన్స్టాలేషన్ వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జిల్లా లైన్స్ గవర్నర్ నరహరి సుధాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బాబురావు నూతన లయన్స్ డైరెక్టరీని ఆవిష్కరించారు.
నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ ఉదయభాస్కర్ మాట్లాడుతూ..
విశిష్ట అతిథిగా పాల్గొన్న నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ ఉదయభాస్కర్ మాట్లాడుతూ స్వచ్ఛందంగా సేవా భవంతు లైన్స్ నిర్వహిస్తున్న కార్యక్రమాలను తమ నాబార్డ్ కార్యక్రమాలతో అనుసంధానం చేస్తూ నిర్వహిస్తా మన్నారు. సుధాకర్ రెడ్డి నాయకత్వంలో లయన్స్ ద్వారా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను ఆయన ప్రశంసించారు. రైతులకు,మహిళలకు చేయూతననందిoచే కార్యక్రమాలను నాబార్డు చేపడుతుందని చెప్పారు. తాడూరి రేణుక శిష్య బృందం ప్రదర్శించిన స్వాగత నృత్యం, ఇతర సాంప్రదాయం నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జిల్లా ప్రథమ లయన్ లేడీ అనిత రెడ్డి అతిథులతో కలిసి జ్యోతి వెలిగించి సేవా సంబరాలు కార్యక్రమాన్ని ప్రారంభించారు.
నూతన నాయకుల చే ప్రమాణస్వీకారం..
ఈ సందర్భంగా బెంగళూరు నుంచి విచ్చేసిన లయన్స్ పూర్వ డైరెక్టర్ వివి కృష్ణారెడ్డి, తనదైన శైలిలో, పుట్ట హరి కిషన్ రెడ్డి, రేవూరి రమణారెడ్డి తదితర జిల్లా క్యాబినెట్ నాయకులతో ఆయన ప్రమాణం చేయించుచు ప్రతి క్లబ్ నుండి ఒక శాశ్వత సేవా ప్రాజెక్ట్ ఏర్పాటు చెసుకునే విధంగా జిల్లా క్యాబినెట్ కృషిచేయాలని అన్నారు. జిల్లా నాయకులకు అంతర్జాతీయ అధ్యక్షుని ప్రశంస పత్రములను పాము శ్రీనివాస్, చొప్పరి సోమయ్య, చంద్రగిరి ప్రసాద్, కటంగూరు రాంగోపాల్ రెడ్డి, డా. దివి అజిత్ కుమార్, బజాజ్ అందుకున్నారు.
మహిళలకు కుట్టు మిషన్లు, విద్యార్థులకు సైకిల్స్ పంపిణీఇన్స్టాలేషన్ వేడుకల్లో భాగంగా పెద్ద ఎత్తున 100 కుట్టు మిషన్ లు, 2000 స్కూల్ బ్యాగ్స్, 80 సైకిల్ లతో సేవా కార్యక్రమాన్ని నిర్వహించి లబ్ధిదారులకు అందజేశారు. ఇన్సాలేషన్ కమిటీ చైర్మన్ గా.. పి డి జీ నడిపల్లి వెంకటేశ్వరరావు, చీఫ్ కోఆర్డినేటర్ గా ముచ్చ రాజిరెడ్డి వ్యవహరించగా, మాస్టర్ ఆఫ్ సర్మనీలుగా పెండం వేణుమాధవ్, తిరునగరి నరేందర్ వ్యవహారించారు.
పాల్గొన్నవారు..
ఈ కార్యక్రమంలో గ్యాట్ ఏరియా లీడర్ ఆవుల గోపాల్ రావ్, ఎల్ సి ఐ ఎఫ్ ఏరియా లీడర్ దీపక్ బట్టచార్జీ, మల్టీపుల్ నాయకులు అమర్నాథ్ రావ్, రాజేంద్ర ప్రసాద్, తీగల మోహన్ రావ్, ఎస్ ఎన్ రెడ్డి, బసవేశ్వర్ రావ్, ప్రకాష్ రావ్, హరీష్ రెడ్డి, వివిధ జిల్లాల గవర్నర్లు, ఉప జిల్లా గవర్నర్ లు, పూర్వ జిల్లా గవర్నర్లు, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు

మమ్మల్ని ఫాలో అవ్వండి