Ticker

6/recent/ticker-posts

Ad Code

నేడు కోర్టులకు ప్రత్యేక సెలవు.. ఎందుకంటే..

  • తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోర్టులకు గుడ్ న్యూస్.. 
  • ఆగస్టు 27న హైకోర్టుతో పాటు అన్ని కోర్టులకు ప్రత్యేక సెలవు..
  • సెలవుకు బదులుగా  డిసెంబర్ 19 శనివారం నాడు పని దినం
  • సెలవు ముచ్చటను గమనించడం మంచిది.

హైదరాబాద్ బ్యూరో, న్యూస్ పేజ్ :

రాష్ట్రంలోని న్యాయవ్యవస్థలో పనిచేసే సిబ్బందికి మరియు లాయర్లకు తెలంగాణ హైకోర్టు ఒక పెద్ద గుడ్ న్యూస్ చెప్పింది. ఆగస్టు 27, 2026 (గురువారం) నాడు రాష్ట్రంలోని హైకోర్టుతో పాటు అన్ని రకాల కింది కోర్టులకు ప్రత్యేక సెలవు (Special Holiday) ప్రకటిస్తూ రిజిస్ట్రార్ జనరల్ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసిండ్రు. గీ సెలవు ప్రకటనతోటి కోర్టు పనుల మీద వచ్చే జనాలకు ముందే విషయం తెల్వడం మంచిదైంది.

ఏమేం కోర్టులు బంద్ ఉంటాయ్?

హైకోర్టు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం.. కేవలం మెయిన్ హైకోర్టే కాకుండా దాని కింద పనిచేసే చాలా సంస్థలకు గీ సెలవు వర్తిస్తుంది.

కీలక సంస్థలు: తెలంగాణ స్టేట్ జ్యుడీషియల్ అకాడమీ, రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీతో పాటు ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్లు కూడా గురువారం నాడు బంద్ ఉంటాయ్.

జిల్లా కోర్టులు కూడా: ఇవే కాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాల కోర్టులు, లేబర్ కోర్టులు, రకరకాల ట్రిబ్యునళ్లకు కూడా గీ సెలవు వర్తిస్తుందని హైకోర్టు స్పష్టం చేసింది.

వరుస సెలవులతో కోర్టులకు పెద్ద బ్రేక్!

ఈ సెలవుల వెనుక ఒక పెద్ద కారణమే ఉంది. ఆగస్టు 26న మిలాద్-ఉన్-నబి పండుగ సెలవు, ఆ తర్వాత ఆగస్టు 28న రక్షాబంధన్ (రాఖీ పౌర్ణమి) సెలవులు ఉన్నాయి. గీ రెండు పండుగల మధ్యల గురువారం ఒక్క రోజే వర్కింగ్ డే ఉండటంతోటి.. లాయర్లు, సిబ్బంది ఇబ్బంది పడకుండా ఉండేందుకు హైకోర్టు ఈ ప్రత్యేక సెలవును డిక్లేర్ చేసింది. దీనితోటి కోర్టులకు వరుసగా మూడు రోజుల పాటు పెద్ద బ్రేక్ దొరికినట్లయింది.

సెలవుకు బదులుగా ఈ రోజు పని దినం!

అయితే.. గిక్కడ ఒక ముచ్చట గుర్తుపెట్టుకోవాలి. గురువారం నాడు ఇచ్చిన సెలవుకు బదులుగా కోర్టులు ఇంకో రోజు అదనంగా పనిచేయాల్సి ఉంటది. దీనికోసం డిసెంబర్ 19, 2026 (శనివారం) నాడు తెలంగాణ హైకోర్టు పక్కాగా పనిచేస్తుందని అధికారులు ముందే క్లారిటీ ఇచ్చిండ్రు. 

కాబట్టి.. కోర్టులల్లో కేసులు ఉండి, ఈ గురువారం నాడు డేట్లు పడ్డ జనాలు ఎవరైనా ఉంటే.. కోర్టులకు పోయి ఇబ్బంది పడకుండా ఈ  సెలవు ముచ్చటను గమనించడం మంచిది.