Ticker

6/recent/ticker-posts

Ad Code

సింగపూర్ లెక్కుండాలే మీరాలం చెరువు!

  • బర్డ్ పారడైజ్, వాటర్ ఫాల్స్, అడ్వెంచర్ పార్కులు, పెళ్లిళ్లకు వచ్చే డెస్టినేషన్లుగా మార్చాలి
  • చెరువులకి మురుగు నీరు అస్సలు రావద్దు
  • రూ.430 కోట్లతో జబర్దస్త్ కేబుల్ బ్రిడ్జి చేయండి.
  • మీరాలం చెరువును సడన్‌గా సుట్టేసిన సీఎం రేవంత్‌ అన్న.. 
  • క్రేన్ ఎక్కి మరీ పనులను సూపు సూసిన ముఖ్యమంత్రి..

హైదరాబాద్‌ బ్యూరో, న్యూస్ పేజ్ :

మన తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారు ఒక్కసారిగా హైదరాబాద్ ఓల్డ్ సిటీల ఉన్న మీరాలం చెరువు కాడికి పోయి అందరినీ అకస్మాత్తుగా సర్ప్రైజ్ చేసిండ్రు. ఎవ్వరికీ సెప్పకుండా, వినకుండా సడన్‌గా అట్ల పోయి అక్కడ జరుగుతున్న డెవలప్‌మెంట్ పనులను తిరగేసి మరి సూసిండ్రు.

ఈ తనిఖీల ఒక ముచ్చట మాత్రం గిప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతాంది. అదేందంటే.. చెరువు సుట్టుపక్కల జరుగుతున్న కట్టడాలు, పనులు ఎట్లున్నాయో సాంతం సూడనికి మన సీఎం గారు ఏకంగా ఒక పెద్ద క్రేన్ ఎక్కిండ్రు. పైకి పోయి మరి వైమానిక కోణం (Aerial View) ల పనులన్నిటినీ గమనించిండ్రు. సీఎం అంత పైకి ఎక్కి సూడడం చూసి గడపలి అధికారులు, జనాలు అవాక్కయ్యిండ్రు.

రూ.430 కోట్లతో జబర్దస్త్ కేబుల్ బ్రిడ్జి

మీరాలం చెరువు మీద సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఐకానిక్ సస్పెన్షన్ కేబుల్ బ్రిడ్జి పనుల ముచ్చటను రేవంత్ అన్న అడిగి తెలుసుకున్నారు. ఈ బ్రిడ్జి కోసం ఏకంగా 430 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (MRDCL) వాళ్లు ఈ పనులను దగ్గరుండి చూసుకుంటున్నారు. ఈ వంతెన గనుక వస్తే శాస్త్రిపురం నుంచి చింతల్‌మెట్ రోడ్డుకు పోయేటోళ్లకు తిప్పలు తప్పుతాయి. రాబోయే 2027 లోపలనే ఈ పని ముగించాలని అధికారులకు గట్టిగా ఆర్డర్ చేసిండ్రు.

సింగపూర్ లెక్క మీరాలం చెరువు

చెరువు నడిమట్ల ఉన్న ఐల్యాండ్‌లను (దీవులను) పర్యాటకులను కిక్కెక్కించేలా తయారు చేయాలని సీఎం సెప్పిండ్రు. సింగపూర్ లోని 'గార్డెన్స్ బై ది బే' తీరుగా ఇక్కడ బర్డ్ పారడైజ్, వాటర్ ఫాల్స్, అడ్వెంచర్ పార్కులు, పెళ్లిళ్లకు వచ్చే డెస్టినేషన్లుగా మార్చాలన్నారు. అట్లనే ఇక్కడికి వచ్చేటోళ్లు ఎంజాయ్ చేయడానికి వాటర్ స్పోర్ట్స్ (Water Sports) డిజైన్లు కూడా తేవాలన్నారు. చెరువులకి మురుగు నీరు అస్సలు రాకుండా, నీటిని శుద్ధి చేసేలా పక్కా ప్లాన్ రెడీ చేయాలని గట్టిగా వార్నింగ్ ఇచ్చిండ్రు. పాతబస్తీ రూపురేఖలు మార్చడమే మా సర్కారు లక్ష్యం అని సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ సందర్భంగా తేల్చి చెప్పిండ్రు.