- హాజరై ఆశీస్సులు అందజేసిన పులిమామిడి రాజు!
- అయ్యప్ప స్వామి ఆలయంలో పుట్టినరోజు సంబరాలు..
- అనంతరం ఘనంగా భిక్షా కార్యక్రమం!
సదాశివపేట బ్యూరో, న్యూస్ పేజ్:
సదాశివపేట పట్టణంలోని ప్రముఖ శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో పిల్లోడి సంగీత–చందు దంపతుల కుమార్తె నాగరిథన్య జన్మదిన వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు సంగారెడ్డి ఎమ్మెల్యే కాంటెస్టెడ్ అభ్యర్థి పులిమామిడి రాజు ముఖ్య అతిథిగా హాజరై చిన్నారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి, ప్రత్యేక ఆశీస్సులు అందజేశారు. చిన్నారుల పుట్టినరోజు వేడుకలను కేక్‌ల సంస్కృతికి భిన్నంగా ఇలాంటి పవిత్రమైన ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించడం ఎంతో అభినందనీయమని ఈ సందర్భంగా పులిమామిడి రాజు కొనియాడారు. చిన్నారి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు.
• అయ్యప్ప స్వాములకు భిక్షా కార్యక్రమం.. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తజనం!
పూజా కార్యక్రమాల అనంతరం ఆలయంలో అయ్యప్ప స్వాములకు పవిత్రమైన భిక్షా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక మహోత్సవంలో గురుస్వాములు సుధాకర్ స్వామి, గోనె శంకర్ స్వామి, అజయ్ స్వామి, రవి స్వామి పాల్గొన్నారు. వీరితో పాటు బంధువులు తాలెల్మ ఈశ్వర్, రాము, పిల్లోడి రామ్ లక్ష్మణ్, పెట్లోళ్ల శివ, శ్రవణ్, పి.శివ, లోకేష్, మరియు స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి చిన్నారి నాగరిథన్యకు దీవెనలు అందించారు.
Tags : Pulimamidi Raju Sangareddy, Sadashivpet Ayyappa Temple Events, Child Birthday Spiritual Celebration, Newspage Local News

మమ్మల్ని ఫాలో అవ్వండి