Ticker

6/recent/ticker-posts

Ad Code

గాయత్రీ దేవి అలంకరణలో వాసవి మాత దర్శనం!

  • రెండో రోజు ‘శ్రీ గాయత్రీ దేవి’ దివ్య అలంకారంలో..
  • భక్తులకు కన్యక పరమేశ్వరి అమ్మవారి దర్శనం
Devotees and Chinta Sainath offering prayers to Goddess Vasavi Kanyaka Parameswari in Gayatri Devi Alankaram in Sadashivapet.

సదాశివపేట, న్యూస్ పేజ్:

స్థానిక శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన సోమవారం నాడు అమ్మవారు ‘శ్రీ గాయత్రీ దేవి’ దివ్య అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. చంద్రిక రవీందర్ గారి ఆధ్వర్యంలో, ఆలయ కమిటీ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ వేడుకల్లో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తనయుడు, యువనేత చింతా సాయినాథ్ ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మహిళల కుంకుమార్చనలు.. భక్తి శ్రద్ధలతో మహాప్రసాద వితరణ:
నవరాత్రి వేడుకలను పురస్కరించుకొని ఆలయంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కుంకుమార్చనలు, లలితా సహస్రనామ పారాయణం చేశారు. అమ్మవారి నామస్మరణలతో ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. మధ్యాహ్నం మహా మంగళహారతి అనంతరం భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహా ప్రసాద వితరణ చేపట్టారు.
ఈ పూజా కార్యక్రమంలో ఎనిమిదో వార్డ్ కౌన్సిలర్ సోము, ఆలయ సంఘం ప్రెసిడెంట్ అనుముల సాయి రాజ్, యువజన ప్రెసిడెంట్ దిడ్డిగె నగేశ్, బిక్షపతి, శంకర్, మోట్లకుంట రవి, వంశీ, అశోక్, సంతోష్, కిషన్, విరల్, వీరు, స్థానిక మహిళలు మరియు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.


Tags: Newspage, Sadashivapet News, Vasavi Mata Temple Navratri, Sadasivpet Kanyaka Parameswari Temple, Gayatri Devi Alankaram, Chinta Sainath, Sangareddy Bhakthi Updates

sadashivapet-vasavi-kanyaka-parameswari-temple-navratri-gayatri-devi