Ticker

6/recent/ticker-posts

Ad Code

సదాశివపేటలో వైభవంగా దేవి నవరాత్రులు.. అన్నదాన కార్యక్రమం నిర్వహణ!

పాల్గొన్న కౌన్సిలర్ పులిమామిడి మమత రాజు దంపతులు

Congress leader Pulimamidi Raju and Councilor Mamatha Goud distributing free food to devotees at Sadashivapet Mahankali temple.

సదాశివపేట, న్యూస్ పేజ్ :

దేవి నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా సదాశివపేట పట్టణంలోని చాపలకేరి శ్రీ మహంకాళి మందిరంలో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. ఉత్సవాల్లో భాగంగా 12వ వార్డు కౌన్సిలర్ పులిమామిడి మమత రాజు దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ రోజు ఆలయంలో శ్రీ మహంకాళి మాత భక్తులకు అన్నపూర్ణాదేవి అవతారంలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా మమత రాజు దంపతులు అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, కుంకుమార్చనలు, విశేష అలంకరణలు చేశారు. ఆలయ అర్చకులు రాకేష్ పంతులు ఆధ్వర్యంలో వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా ఈ పూజలు జరిగాయి. ఈ కుంకుమార్చన పూజల్లో స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.

Congress leader Pulimamidi Raju and Councilor Mamatha Goud distributing free food to devotees at Sadashivapet Mahankali temple image 2

కరువు నుండి కాపాడాలని అమ్మవారికి ప్రార్థన

పూజా కార్యక్రమాల అనంతరం సంగారెడ్డి ఎమ్మెల్యే కాంటెస్టెడ్ అభ్యర్థి పులిమామిడి రాజు మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో ‘ఎల్ నినో’ ప్రభావం వల్ల వర్షాలు కురవక, తాగునీటి ఎద్దడి ఏర్పడి పాడి పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ప్రజలను సుభిక్షంగా ఉంచాలని, కరువు నుండి కాపాడి సకాలంలో వర్షాలు కురిపించాలని ఆ అన్నపూర్ణాదేవిని, మహంకాళి మాతను వేడుకున్నట్లు తెలిపారు. అమ్మవారి నిమజ్జనానికల్లా చెరువులు జలకళలాడేలా వర్షం కురిపించాలని ప్రార్థించామన్నారు. సదాశివపేట పుణ్యభూమి అని, ఆ సదాశివుడు కొలువైన ఈ ప్రాంతంలో ఉన్నన్ని దేవాలయాలు మరెక్కడా లేవని ఆయన కొనియాడారు.

పూజల అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులకు పులిమామిడి మమత రాజు దంపతుల ఆధ్వర్యంలో మహా అన్నదానం నిర్వహించారు. ఆ తర్వాత జరిగిన భజన కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణం భక్తి పారవశ్యంతో మారుమోగింది. ఈ కార్యక్రమంలో 11వ వార్డు కౌన్సిలర్ వైద్యం గోపి ప్రియాంక పవన్, మహంకాళి దేవాలయ కమిటీ అధ్యక్షులు నల్ల సుధాకర్, ప్రధాన కార్యదర్శి నల్ల శంకర్, కార్యవర్గ సభ్యులు చాపల హన్మంతు, జనార్ధన్, బంటు రవి, సాతాని నరేందర్, మహేష్, అఖిల్, నాగరాజు, రాగం అనిల్, తాలెల్మ రాము, సోమ శంకర్ మరియు పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు.


Tags: Newspage, Sadashivapet News, Pulimamidi Mamatha Raju, Mahankali Temple Sadasivpet, Annapurna Devi Alankaram, Free Food Donation, Sangareddy Congress Leaders