- గోడ పత్రికను ఆవిష్కరిస్తున్న పులిమామిడి రాజు
సదాశివపేట, అక్టోబర్ 18 (న్యూస్ పేజ్):
తెలంగాణ వీరయోధుడు, ప్రజల కోసం పోరాడిన ధీరుడు పండుగ సాయన్న జయంతి వేడుకలను ఈ నెల 22వ తేదీన హైదరాబాద్ లోని రవీంద్ర భారతి ఆడిటోరియం నందు ఘనంగా నిర్వహించబడును. కావున ముఖ్య అతిథులు, అతిథులు, నాయకులు, అన్ని జిల్లాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, ముదిరాజ్ సంఘం నాయకులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పండుగ సాయన్న జయంతి వేడుకల్లో పాల్గొనాలని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కూడా ముదిరాజ్ బంధువులు ఘనంగా నిర్వహించాలని సంగారెడ్డి ఎమ్మెల్యే కాంటెస్టెడ్ అభ్యర్థి పులిమామిడి రాజు పిలుపునిచ్చారు.
సదాశివపేట పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో ఈ రోజు ఉదయం 12:00 గంటలకు ఆయన పండగ సాయన్న జయంతి గోడపత్రికను, పోస్టర్ ను నారాయణ గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ చరిత్రలో పండుగ సాయన్నకు ప్రత్యేక స్థానం ఉందని, ఆయన పోరాట స్ఫూర్తి, ధైర్యసాహసాలు, ప్రజల పట్ల చూపిన అంకితభావం నేటి తరానికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. తెలంగాణ రాబిన్‌హుడ్‌గా పేరుగాంచిన పండుగ సాయన్న జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేందుకు సిద్ధమవడం సంతోషకరమని పులిమామిడి రాజు అన్నారు.
పండుగ సాయన్న జీవిత చరిత్రను, ఆయన చేసిన పోరాటాలను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. ఆయన ఆశయాలు, సేవాభావం సమాజానికి స్ఫూర్తినిచ్చేలా జయంతి వేడుకలను నిర్వహించాలని సూచించారు. ఈ నెల 22వ తేదీన నిర్వహించనున్న జయంతి కార్యక్రమాల్లో ముదిరాజ్ బంధువులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. పండుగ సాయన్నకు తగిన గుర్తింపు లభించేలా, ఆయన చరిత్ర ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నారాయణ, చీలం రమేష్, నల్ల సాయి, వెంకట్, రాగం అనిల్, తదితరులు పాల్గొన్నారు.
Tags: Pulimamidi Raju, Panduga Sayanna Jayanthi, Sadashivpet News, Mudiraj Sangham, Ravindra Bharathi, Sangareddy News, Panduga Sayanna Poster Release, సదాశివపేట వార్తలు, పండుగ సాయన్న జయంతి, పులిమామిడి రాజు.

మమ్మల్ని ఫాలో అవ్వండి