Ticker

6/recent/ticker-posts

Ad Code

జిల్లా కలెక్టర్‌ను కలిసి విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన పులిమామిడి రాజు!

  • అక్టోబర్ 22న పండుగ సాయన్న జయంతి వేడుకలను 
  • ఘనంగా నిర్వహించేందుకు సహకరించాలని కలెక్టర్‌ ప్రతీక్ జైన్‌కు విజ్ఞప్తి

Sangareddy MLA contested candidate Pulimamidi Raju presenting a flower bouquet to District Collector Prateek Jain

సంగారెడ్డి, అక్టోబర్ 19, న్యూస్ పేజ్ :

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఐఏఎస్‌ను సంగారెడ్డి ఎమ్మెల్యే కాంటెస్టెడ్ అభ్యర్థి పులిమామిడి రాజు మర్యాదపూర్వకంగా కలిసి విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలుపగా, ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ వీరయోధుడు, దివంగత పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి, వర్ధంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వ వేడుకలుగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో, ఈ నెల 22న నిర్వహించనున్న పండుగ సాయన్న జయంతి వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్‌తో పులిమామిడి రాజు చర్చించారు.

జయంతి వేడుకలను ఘనంగా, గౌరవప్రదంగా నిర్వహించేందుకు సభా వేదిక ఏర్పాటు, పూలమాలలతో నివాళులర్పించడం, వేదిక అలంకరణ, ప్రచార కార్యక్రమాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ తదితర ఏర్పాట్లకు జిల్లా యంత్రాంగం తరఫున పూర్తి సహకారం అందించాలని కలెక్టర్‌ను కోరారు. తెలంగాణ చరిత్రలో పండుగ సాయన్నకు ప్రత్యేక స్థానం ఉందని, ఆయన సేవలు, పోరాట స్ఫూర్తిని భావితరాలకు తెలియజేసేలా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ వేడుకల్లో ముదిరాజ్ సంఘం నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సంగారెడ్డి పట్టణ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు జనార్ధన్‌తో పాటు పిట్టల రమేష్, మామిళ్ల ఆనంద్, రాజేష్, బుస్స సాయి, బస్వరాజ్, పవన్ తదితరులు పాల్గొన్నారు.


 తెలంగాణ వీరయోధుడు పండుగ సాయన్న జయంతి వేడుకలను ప్రభుత్వ అధికారిక ఉత్సవాలుగా నిర్వహించాలన్న నిర్ణయం అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి దక్కిన గౌరవం. ఈ నేపథ్యంలో పులిమామిడి రాజు ముదిరాజ్ సంఘం నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్‌ను కలిసి ఏర్పాట్లపై చర్చించడం బాధ్యతాయుతమైన చర్య.



Tags : newspage news, Sangareddy Collector Prateek Jain, Pulimamidi Raju Mudiraj, Panduga Sayanna Jayanthi 2026