Ticker

6/recent/ticker-posts

Ad Code

సదాశివపేటలో సామూహిక గణేష్ ఉత్సవ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

  • ఘనంగా వినాయక నిమజ్జన శోభాయాత్ర కరపత్రం ఆవిష్కరణ 
  • శాంతియుతంగా వేడుకలు జరపాలని కమిటీ పిలుపు

సదాశివపేట గణేష్ ఉత్సవ కమిటీ నూతన సభ్యులు కరపత్రం ఆవిష్కరిస్తున్న దృశ్యం

సదాశివపేట, సెప్టెంబర్ 22  (న్యూస్ పేజ్) :

సదాశివపేట పట్టణంలో సామూహిక గణేష్ ఉత్సవాల నిర్వహణకు సంబంధించి నూతన కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసింది. సదాశివపేట పట్టణ సామూహిక గణేష్ ఉత్సవ కమిటీని నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వినాయక నిమజ్జన మహోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిర్వాహకులు నిమజ్జన శోభాయాత్ర వరుస క్రమ సంఖ్య కరపత్రాన్ని విడుదల చేశారు. ​ఈ సందర్భంగా కమిటీ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడిగా రాందాస్ రవీంద్రనాథ్ , ముఖ్య సలహాదారుగా సత్యనారాయణ మునిపల్లి, ప్రధానకార్యదర్శిగా పవన్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు. ​అలాగే కమిటీ సభ్యులుగా పాండురంగారెడ్డి డోనూరు, విష్ణువర్ధన్ రెడ్డి, నాగనాథ్, రాజన్నస్వామి, బరాడి తిరుపతి, గంట శివయ్య, పృథ్వీరాజ్, మహేష్ స్వామి, శంకర్ గౌడ్, మాణిక్ రావు, శ్రీశైలం, నాగన్న ఉల్లిగడ్డల, యగరి శంకర్ గౌడ్ కన్నా, అనిల్ కుమార్, చిల్ల మల్లన్న, పిల్లోడి విశ్వనాథ్, నాగరాజు గౌడ్ (జై), శివలింగం, హరి తదితరులు బాధ్యతలు స్వీకరించారు. నిమజ్జన వేడుకలను శాంతియుత వాతావరణంలో విజయవంతం చేయాలని కమిటీ ప్రతినిధులు కోరారు


సదాశివపేటలో వైభవంగా గణేష్ నిమజ్జనోత్సవ ఏర్పాట్లు

సదాశివపేట సామూహిక గణేష్ ఉత్సవ నూతన కమిటీ

సదాశివపేటలో వినాయక చవితి పండుగ, గణేశ్ నిమజ్జన వేడుకలను ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా, సదాశివపేట సామూహిక గణేష్ ఉత్సవ కమిటీకి కొత్త బాధ్యులను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. నిమజ్జన శోభాయాత్ర ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా సాగడం కోసం సిద్ధం చేసిన ‘వరుస క్రమ సంఖ్య’ కరపత్రాన్ని కమిటీ సభ్యులు అధికారికంగా విడుదల చేశారు.

నూతన కమిటీ వివరాలు: 

  • అధ్యక్షులు: రవీంద్రనాథ్ రాందాస్, ముఖ్య సలహాదారు: మునిపల్లి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి: పవన్ కుమార్ గౌడ్, కమిటీ సభ్యులు: డోనూరు పాండురంగారెడ్డి, పి. విష్ణువర్ధన్ రెడ్డి, నాగనాథ్. టి, రాజన్నస్వామి, తిరుపతి బరాడి, శివయ్య గంట, పృథ్వీరాజ్, మహేష్ స్వామి, నాగన్న ఉల్లిగడ్డల, శంకర్ గౌడ్, మాణిక్ రావు, శ్రీశైలం, శంకర్ గౌడ్ కన్నాయగరి, బి. అనిల్ కుమార్, మల్లన్న చిల్ల, విశ్వనాథ్ పిల్లోడి, నాగరాజు గౌడ్ (జై), శివలింగం, హరి.

మున్సిపాలిటీకి వినతిపత్రం – సమగ్ర ఏర్పాట్లకు విజ్ఞప్తి:

ఈ నెల 23-10-2026 బుధవారం మరియు 25-10-2026 శుక్రవారం రోజుల్లో పట్టణంలో జరిగే భారీ సామూహిక నిమజ్జన ఊరేగింపులను దృష్టిలో ఉంచుకొని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ గౌరవ మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్, కౌన్సిలర్లు మరియు కమిషనర్‌లకు కమిటీ పక్షాన వినతిపత్రం సమర్పించారు.

కమిటీ కోరిన ముఖ్యమైన అంశాలు:

సీసీ రోడ్ల మరమ్మతులు: ఊరేగింపునకు ఆటంకం కలగకుండా వినాయక చౌక్ (గాంధీ చౌక్) వద్ద గుంతలను వెంటనే సీసీతో పూడ్చివేయాలి.

పెద్ద విగ్రహాల ఊరేగింపు సమయంలో భద్రతా కారణాల వల్ల ప్రధాన కరెంట్ సరఫరాను నిలిపివేస్తారు. అందువల్ల, వినాయక చౌక్ నుండి సిద్ధాపురం గల్లీ, గడి మైసమ్మ గుడి, ఎస్ మార్ట్ మరియు బచ్చు కిషన్ షాప్ వరకు ఉన్న ప్రాంతాలలో జనరేటర్ల సాయంతో నిరంతర విద్యుత్ దీపాలు (లైటింగ్) ఏర్పాటు చేయాలి. అదేవిధంగా, మైక్ మరియు సౌండ్ సిస్టమ్స్ కూడా ఎక్కడా ఆగకుండా జనరేటర్ల ద్వారానే నిరంతరం నడిచేలా చర్యలు తీసుకోవాలి.

వినాయక చౌక్ వద్ద ట్యాంకర్లకు బదులుగా వాటర్ క్యాన్లు ఏర్పాటు చేయాలి. పారిశుద్ధ్యం: భక్తులు, ప్రజల సౌకర్యార్థం వినాయక చౌక్ వద్ద మొబైల్ టాయిలెట్లను అందుబాటులో ఉంచాలి.

భారీ క్రేన్లు: పట్టణంలో విగ్రహాలు అత్యంత భారీ పరిమాణంలో ఉన్నందున, వినాయక సాగర్ (ఉబ్బ చెరువు)లో నీటిమట్టం తక్కువగా ఉన్న దృష్ట్యా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా భారీ క్రేన్లను ముందుగానే రప్పించి నిమజ్జనం సజావుగా సాగేలా చూడాలి.

భక్తుల మనోభావాలను గుర్తించి, ఉత్సవాలను విజయవంతం చేసేందుకు మున్సిపల్ యంత్రాంగం యుద్ధప్రాతిపదికన స్పందించి పనులను పూర్తి చేయాలని కమిటీ సభ్యులు కోరారు.


#NewsPage Updates, #sadasivapet news, #sadashivapetganesh utsav committee.