Ticker

6/recent/ticker-posts

Ad Code

మంత్రివర్గంలో చోటు ఇవ్వకుంటే ఇక యుద్ధమే.. మున్నూరు కాపులు

  • ప్రభుత్వానికి మున్నూరు కాపు సంఘం గట్టి హెచ్చరిక!
  • హైదరాబాద్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పలు కీలక తీర్మానాలు..
  • కోకాపేట ఆత్మగౌరవ భవన నిర్మాణ పనులను పరిశీలించిన నేతలు!
  • భవన నిర్మాణానికి భారీగా విరాళాలు అందజేసిన దాతలు..

munnuru-kapu-dispute

కోలా జనార్దన్ పటేల్, న్యూస్ పేజ్ :

తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మున్నూరు కాపు సామాజిక వర్గానికి ప్రస్తుత ప్రభుత్వ మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవడం తీవ్ర విచారకరమని, రానున్న మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో తగిన చోటు కల్పించకుంటే ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతామని తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు పుట్టం పురుషోత్తం రావు స్పష్టం చేశారు. హైదరాబాద్ గండిపేటలోని గణేష్ ఫంక్షన్ హాల్ లో బుధవారం మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగింది. ఈ సందర్భంగా పురుషోత్తం రావు మాట్లాడుతూ.. జనాభాలో పెద్ద శాతం ఉన్న తమ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వకపోవడం కాపులను పూర్తిగా నిర్లక్ష్యం చేయడమేనని మండిపడ్డారు. 

కీలక తీర్మానాలు – సభ్యత్వ నమోదు:

సమావేశంలో సంఘం బలోపేతం కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గతంలో పంపిణీ చేసిన సభ్యత్వ పుస్తకాలను సకాలంలో పూర్తి చేసి రాష్ట్ర కమిటీకి అందజేయాలని, నిర్లక్ష్యం వహిస్తే కుదరదని బాధ్యులను కోరారు. అలాగే మున్నూరు కాపుల పేరుతో నూతనంగా ఏర్పడుతున్న అనధికారిక కమిటీలను తక్షణమే రద్దు చేసుకోవాలని అల్టిమేటం జారీ చేశారు. సంఘం తరఫున ప్రచురించిన 2026 క్లారిటీ డైరీకి మంచి గుర్తింపు లభించిందని, ఇదే ఉత్సాహంతో 2027 నాటి నూతన డైరీని కూడా త్వరలోనే ప్రచురించాలని ఈ వేదికపై ఏకగ్రీవంగా తీర్మానించారు.

కోకాపేట భవన నిర్మాణ నిధుల లొల్లి:

కార్యవర్గ సమావేశం ముగిసిన అనంతరం నేతలందరూ కోకాపేటలోని మున్నూరు కాపు ఆత్మగౌరవ భవన నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. గతంలో ప్రభుత్వం కేటాయించిన 5 ఎకరాల స్థలంతో పాటు హామీ ఇచ్చిన రూ.5 కోట్ల నిధులను తక్షణమే విడుదల చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ను సంఘం డిమాండ్ చేసింది. భవన నిర్మాణ ఫండ్ కోసం ఎవరైనా రూ.5 లక్షల సహాయం అందిస్తే వారిని ట్రస్ట్ కమిటీలో సభ్యులుగా చేర్చుకుంటామని ప్రకటించారు. ఈ క్రమంలో పలువురు దాతలు విరాళాలు ప్రకటించగా, రాష్ట్ర ఉపాధ్యక్షులు తోట శ్రీనివాస్ పటేల్ ఒక లక్ష రూపాయల చెక్కును సంఘానికి అందజేశారు.

ముఖ్యాంశాలు

గ్రామస్థాయికి తీర్మానాలు: ఈ సమావేశంలో ఆమోదించిన రాజకీయ, సామాజిక తీర్మానాలను నియోజకవర్గ, గ్రామస్థాయిలోకి తీసుకెళ్లి ప్రజలను చైతన్యపరచనున్నారు.

ఆదాయ వ్యయాల నివేదిక: సంఘం కోశాధికారి కంచి సత్యనారాయణ గారు వార్షిక ఆదాయ వ్యయాల లెక్కలను, మరియు ప్రధాన కార్యదర్శి పెద్ది పెంటయ్య గారు కార్యక్రమ వివరాలను వెల్లడించారు.

రాష్ట్రవ్యాప్త మద్దతు: ఈ ప్రతిష్టాత్మక రాష్ట్ర స్థాయి సమావేశంలో వివిధ జిల్లాల నుండి మున్నూరు కాపు లీడర్లు, కార్యవర్గ సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

మంత్రివర్గ విస్తరణ వేళ మున్నూరు కాపు సంఘం అధినేతలు చేసిన ఈ యుద్ధ ప్రకటన అధికార కాంగ్రెస్ సర్కార్ పై పొలిటికల్ గా గట్టి ఒత్తిడి పెంచడం వంద శాతం పక్కా. ఒకవైపు సామాజిక ఆత్మగౌరవ భవన నిర్మాణ పనులు వేగవంతం అవుతుండగా, మరోవైపు రాజకీయ వాటా కోసం కాపులు ఏకం కావడం విశేషం.