- కూకట్పల్లి వినాయకనగర్‌లో అర్హులకు స్మార్ట్ రేషన్ కార్డులను..
- అందజేసిన కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్ బండి రమేష్
బాలానగర్(మేడ్చల్), సెప్టెంబరు 17(న్యూస్ పేజ్):
గత ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డులు పొందాలంటే గగనంగా ఉండేదని, ముఖ్యంగా పేద ప్రజల కష్టాలు వర్ణనాతీతంగా ఉండేదని, 10 సంవత్సరాల కాలంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వకపోవడం దుర్మార్గమని కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ అన్నారు. గురువారం కూకట్పల్లి నియోజకవర్గంలోని వినాయకనగర్ లో తెలంగాణ ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం మధు మోహన్ రేషన్ షాప్ నెంబర్ : 3384088 వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన విచేసి రేషన్ స్మార్ట్ కార్డులను రేషన్ కార్డు లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వ హయంలో కేసీఆర్, కెటిఆర్, హరీష్ రావులు పేద ప్రజలకు చేసిన పాపాల కారణంగానే ఎన్నికల్లో ఓటమిపాలయ్యారని అన్నారు. ఒక్క రేషన్ కార్డు ఇవ్వకుండా వేధించి కాల్చుకు తిన్నారని తీవ్రంగా విమర్శించారు. నేడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయంలో ఎన్నికల్లో మాట ఇచిన మాదిరిగా ఈ రోజు ప్రతీ పేదవాడికి రేషన్ కార్డును గర్వంగా అందజేస్తున్నామని అన్నారు. రేషన్ స్మార్ట్ కార్డులు ఇస్తున్న సమయంలో పేదవాడి కళ్ళల్లో ఆనందం కనిపించిందని అన్నారు.
ముఖ్యాంశాలుఎన్నికల హామీ అమలు: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అర్హులైన ప్రతి పేదవాడికి రేషన్ కార్డు ఇస్తామని ఇచ్చిన మాటను ప్రజా ప్రభుత్వం గర్వంగా నిలబెట్టుకుందని బండి రమేష్ కొనియాడారు.అధికారుల పర్యవేక్షణ: లబ్ధిదారుల బయోమెట్రిక్ ఈ-కేవైసీ (e-KYC) నమోదు, మరియు స్మార్ట్ కార్డుల జారీ ప్రక్రియను పౌరసరఫరాల శాఖ అధికారులు పారదర్శకంగా పూర్తి చేశారు.
ఈ కార్యక్రమంలో బాలానగర్ సర్కిల్ అసిస్టెంట్ సివిల్ సప్లై అధికారి కళ్యాణ్, బాలానగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులి శివ కుమార్ గౌడ్, కూకట్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొండకింది పుష్పారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు పులి శ్రీకాంత్ పటేల్, ఎ బ్లాక్ అధ్యక్షుడు నాగిరెడ్డి, మహేందర్, మట్టే ప్రసన్న, సదా గౌడ్, సత్యపాల్ రెడ్డి, శివ, భరత్, తదితరులు పాల్గొన్నారు.
Tags : Bandi Ramesh Congress, Smart Ration Card Distribution, Kukatpally Balanagar Local News, Newspage Telangana Political News

మమ్మల్ని ఫాలో అవ్వండి