Ticker

6/recent/ticker-posts

Ad Code

ఈరోజు అంతరిక్షంలో ఏం జరిగిందంటే!.. తాజా ముచ్చట్లు.. ఫటాఫట్!

  • నింగిలోకి నాసా కొత్త టెలిస్కోప్ 'రోమన్'.. 
  • అంతరిక్షంలో ఎలాన్ మాస్క్ ఏఐ శాటిలైట్లు!
  •  స్పేస్ ఎక్స్ సరికొత్త సెంచరీ – ఒకే ఏడాదిలో 100 లాంచ్‌లు!
  • ఇస్రో 'గగన్‌యాన్' అప్‌డేట్ – నెక్స్ట్ 4 నెలల్లోనే ట్రయల్ రన్!
  • చైనా 'మూన్ మిషన్' ఆలస్యం – నీటి వేట వాయిదా!
  • ఇంకెదుకాలస్యం చదివేయండి..

హైదరాబాద్ బ్యూరో, న్యూస్ పేజ్ :

భూమి మీద జరిగే లొల్లులే కాకుండా.. అనంతమైన అంతరిక్షంలో కూడా రోజుకో కొత్త ముచ్చట వెలుగులోకి వస్తూనే ఉంటది. అమెరికా నాసా నుండి మన ఇస్రో దాకా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతరిక్ష సంస్థలు నింగిలోకి రాకెట్లను పంపుతూ కొత్త గ్రహాల గుట్టు విప్పుతున్నాయి. ఈరోజు ప్రపంచాన్ని షేక్ చేస్తున్న టాప్ స్పేస్ అప్‌డేట్స్ అన్నీ కలిపి మీకోసం ప్రత్యేకంగా ఇగో ఇక్కడ ఇస్తున్నాం. ఆ ముచ్చట్లేందో ఒకసారి చూద్దాం!

1. నాసా కొత్త టెలిస్కోప్ 'రోమన్' – ఫాల్కన్ హెవీ రాకెట్‌లో ప్యాకింగ్ ఖతమ్!

అంతరిక్షంలోకి ఇంకో కొత్త కన్నును పంపడానికి అమెరికా అంతరిక్ష సంస్థ పక్కాగా రెడీ అయింది. నాసా ప్రతిష్టాత్మకంగా తయారు చేసిన 'నాన్సీ గ్రేస్ రోమన్' అంతరిక్ష టెలిస్కోప్ లాంచ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. స్పేస్ ఎక్స్ కంపెనీ ఈ బస్సు సైజులో ఉన్న భారీ టెలిస్కోప్‌ను తన 'ఫాల్కన్ హెవీ' రాకెట్ లోపల పెట్టి నిన్ననే ప్యాకింగ్ పూర్తి చేసింది. వచ్చే ఆదివారం, అంటే ఆగస్టు 30 తెల్లవారుజామున ఫ్లోరిడా నుండి ఇది నింగిలోకి ఎగరనుంది. విశ్వంలో దాగున్న డార్క్ మ్యాటర్, కొత్త గ్రహాల గుట్టు విప్పడానికే నాసా దీన్ని పంపుతోంది.

2. స్పేస్ ఎక్స్ & ఎన్విడియా కిర్రాక్ ప్లాన్ – అంతరిక్షంలో ఏఐ  శాటిలైట్లు!

ఎలాన్ మాస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ ఏఐ సంస్థ, గ్రాఫిక్స్ చిప్స్ తయారు చేసే ప్రముఖ 'ఎన్విడియా' కంపెనీతో కలిసి ఇవాళ ఒక సంచలన ముచ్చట చెప్పింది. భూమి మీదే కాకుండా అంతరిక్షంలోనే ఆర్బిటల్ ఏఐ సూపర్ కంప్యూటర్లను నడపడానికి వీరు 'స్టార్‌మైండ్' అనే కొత్త శాటిలైట్ సిస్టమ్‌ను డెవలప్ చేస్తున్నారు. భూమి మీద వాడే అత్యంత శక్తివంతమైన ఎన్విడియా 'వెరా రూబిన్' ఆర్కిటెక్చర్‌ను వీరు అంతరిక్షంలోకి తీసుకెళ్తున్నారు. దీనివల్ల అంతరిక్షంలోనే డేటా ప్రాసెసింగ్ మస్తు ఫాస్ట్‌గా జరుగుతది.

3. స్పేస్ ఎక్స్ సరికొత్త సెంచరీ – ఒకే ఏడాదిలో 100 లాంచ్‌లు!

ఎలాన్ మాస్క్ స్పేస్ ఎక్స్ కంపెనీ ఈ 2026 ఏడాదిలో ఏకంగా 100వ రాకెట్ లాంచ్‌ను పూర్తి చేసి సరికొత్త సెంచరీ కొట్టింది. ఒకే క్యాలెండర్ ఇయర్ లో వంద అంతరిక్ష మిషన్లను సక్సెస్ ఫుల్ గా లాంచ్ చేయడం ప్రపంచంలోనే ఇదే మొదటిసారి. ప్రస్తుతం అంతరిక్షంలో 11,000 కంటే ఎక్కువ స్టార్‌లింక్ ఇంటర్నెట్ శాటిలైట్లు తిరుగుతున్నాయని మాస్క్ కన్ఫర్మ్ చేశారు. ప్రపంచంలో ఇంటర్నెట్ లేని మూలలకు కూడా కనెక్టివిటీ ఇవ్వడమే దీని టార్గెట్.

4. ఇస్రో 'గగన్‌యాన్' అప్‌డేట్ – నెక్స్ట్ 4 నెలల్లోనే ట్రయల్ రన్!

మన భారతీయులను అంతరిక్షంలోకి పంపే ప్రతిష్టాత్మక 'గగన్‌యాన్' మిషన్‌కు సంబంధించిన మొదటి అన్‌కృవ్డ్ (మనుషులు లేని) రాకెట్ టెస్ట్ ఫ్లైట్‌ను రాబోయే నాలుగు నెలల్లోనే లాంచ్ చేయబోతున్నట్టు ఇస్రో చీఫ్ ఎస్. సోమనాథ్ స్పష్టం చేశారు. 2040 కల్లా చంద్రుడిపై భారతీయుడు అడుగుపెట్టడం ఖాయమని ఇస్రో గట్టి నమ్మకంతో ఉంది.

5. చైనా 'మూన్ మిషన్' ఆలస్యం – నీటి వేట వాయిదా!

చంద్రుని దక్షిణ ధ్రువం మీద మంచు రూపంలో ఉన్న నీటిని వెతకడానికి చైనా ప్లాన్ చేసిన 'చాంగే-7' (Chang'e-7) రోబోటిక్ మూన్ మిషన్ అనుకున్న టైంకి లాంచ్ అవ్వడం లేదు. "వంద శాతం సక్సెస్" కావాలనే కారణంతో చైనా ఈ ప్రాజెక్టును ముందస్తు విండో నుండి తాత్కాలికంగా వాయిదా వేసింది.