Ticker

6/recent/ticker-posts

Ad Code

దసరా రేసులో.. మెగాస్టార్, రెబల్ స్టార్ అవుట్!

  • టాలీవుడ్‌లో దసరా రేసు హీటెక్కింది.. బరిలో నిలిచేది ఎవరో? మారిన సమీకరణాలు!
  • అక్టోబర్ రేసు నుండి తప్పుకోనున్న మెగాస్టార్ ‘విశ్వంభర’.. ప్రభాస్ ‘ఫౌజీ’ కూడా అవుట్!
  • రజనీకాంత్ ‘జైలర్ 2’ తో విజయ్ దేవరకొండ ‘రణబలి’ ఊరమాస్ షోడౌన్ ఫిక్స్!

హైదరాబాద్ బ్యూరో, న్యూస్ పేజ్ :

టాలీవుడ్ ఇండస్ట్రీలో దసరా పండగ సీజన్ వచ్చిందంటే బాక్సాఫీస్ దగ్గర పెద్ద సినిమాల యుద్ధం ఏ రేంజ్‌లో ఉంటదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, ఈ ఏడాది అక్టోబర్ దసరా రేసులోని సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. నిన్న మొన్నటిదాకా రేసులో ఉంటాయనుకున్న కొన్ని భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులు వాయిదా పడటంతో, సరికొత్త స్టార్ హీరోల కాంబినేషన్లు బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నాయి.

మెగాస్టార్, రెబల్ స్టార్ అవుట్:

నిజానికి ఈ దసరా కానుకగా మెగాస్టార్ చిరంజీవి సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ అక్టోబర్ 15న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, తాజా సమాచారం ప్రకారం భారీ గ్రాఫిక్స్ (VFX) పనులు ఆలస్యం కావడం వల్ల ఈ సినిమా రేసు నుండి తప్పుకున్నట్లు టాక్ నడుస్తోంది. అటు హను రాఘవపూడి డైరెక్షన్‌లో వస్తున్న ప్రభాస్ ‘ఫౌజీ’ కూడా డిసెంబర్‌కు షిఫ్ట్ అయిపోయింది. దీంతో దసరా విండోలో థియేటర్లు ఖాళీ అవ్వడంతో మిగతా హీరోలు గట్టి స్కెచ్ వేశారు.

ముఖ్యాంశాలు

‘రణబలి’ వర్సెస్ ‘జైలర్ 2’: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న పీరియడ్ యాక్షన్ డ్రామా 'రణబలి' అక్టోబర్ 16న రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. ఇది అక్టోబర్ 15న రాబోతున్న సూపర్ స్టార్ రజనీకాంత్ ‘జైలర్ 2’ తో బాక్సాఫీస్ దగ్గర నేరుగా ఢీకొట్టబోతోంది.

వెంకీ మామ దావత్: విక్టరీ వెంకటేష్ నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47’ అక్టోబర్ 1న రిలీజ్ కానుండటంతో దసరా హాలిడేస్ అడ్వాంటేజ్ దీనికి గట్టిగా దక్కేలా ఉంది.

'కింగ్ 100' సస్పెన్స్: నాగార్జున ప్రతిష్టాత్మక 100వ చిత్రం 'కింగ్ 100' గ్లింప్స్ నిన్ననే విడుదలైంది. ఈ సినిమా కూడా దసరా రేసును టార్గెట్ చేసినా, షూటింగ్ వేగం బట్టి అక్టోబరా లేక క్రిస్మస్ కానుకగా వస్తుందా అనేది చూడాలి.

వీరితో పాటు ధనుష్ నటిస్తున్న ‘ఓం’ చిత్రం కూడా అక్టోబర్ 15న రిలీజ్ అవుతుండటంతో ఈ దసరాకు సౌత్ బాక్సాఫీస్ దగ్గర ఊహించని రేంజ్‌లో ఊచకోత ఖాయంగా కనిపిస్తోంది.


Tags: Tollywood Dasara Releases 2026, Ranabaali Movie Release Date, Jailer 2 Vs Ranabaali Box Office Clash, Vishwambhara Movie Postponed, Newspage Cinema Updates