- సమస్యల పరిష్కారానికి హామీ!
- ఇంటింటికీ టీడీపీ’ ప్రచారంలో కూటమి ప్రభుత్వ విజయాల హోరు!
అనకాపల్లి బ్యూరో ఆగస్టు 26 న్యూస్ పేజ్
ఆంధ్రప్రదేశ్‌లో అధికార కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా పెందుర్తి నియోజకవర్గంలో "ఇంటింటికీ తెలుగుదేశం" కార్యక్రమాన్ని స్థానిక నాయకులు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టారు.
టీడీపీ జాతీయ అధ్యక్షులు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు.. పెందుర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ శ్రీ గండి బాబ్జీ గారి ఆశీస్సులతో స్థానిక 98వ కార్పొరేటర్, క్లస్టర్-10 ఇన్‌చార్జ్ శ్రీ రౌతు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ ప్రచార కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.
ప్రతి ఇంటికీ వెళ్లి సంక్షేమ పథకాల వివరణ..
ఈ ప్రచారంలో భాగంగా పెందుర్తి నియోజకవర్గం క్లస్టర్-10 పరిధిలోని 251, 252, 253, 254 బూత్‌ల పరిధిలో ఉన్న దళితవాడ, వీఆర్సీ పాలెం ప్రాంతాలలో నాయకులు విస్తృతంగా పర్యటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే సాధించిన విజయాలను, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను మరియు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించారు.
ప్రజా సమస్యలపై తక్షణ స్పందన..
టీడీపీ నాయకులు ప్రతి ఇంటికీ వెళ్లి స్థానికులతో నేరుగా ముచ్చటించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు లేవనెత్తిన పలు స్థానిక సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి తక్షణమే కృషి చేస్తామని నాయకులు హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలనను ప్రజలు హర్షిస్తున్నారని రౌతు శ్రీనివాస్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ విసృ్తత ప్రచార కార్యక్రమంలో బూత్ కన్వీనర్లు మల్లి శ్రీనివాసరావు, ఈమండి శ్రీనివాసరావు, ఈమండిన్ని శ్రీనివాసరావు, యూనిట్ ఇన్‌చార్జ్ రాజుల (చెన్నారావు) అప్పారావు, ప్రధాన కార్యదర్శి మరుపిల్లి వీరగా నాగాంజనేయమూర్తితో పాటు పెద్ద సంఖ్యలో టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానికులు పాల్గొన్నారు.

మమ్మల్ని ఫాలో అవ్వండి