Ticker

6/recent/ticker-posts

Ad Code

ఫోన్ పోయిందా? జర ఇక్కడ చూడురి.. 98 మొబైల్స్ రికవరీ!

  • సిఈఐఆర్ పోర్టల్‌తో పోగొట్టుకున్న ఫోన్లు లభ్యం
  • బాలానగర్  ఎసిపి నరేష్ రెడ్డి

బాలానగర్(మేడ్చల్), ఆగస్టు 29(న్యూస్ పేజ్): 

ఈ రోజుల్లో చేతిలో ఫోన్ లేకపోతే పానం పోయినంత పనైతది. పొరపాటున ఎక్కడైనా ఫోన్ పడిపోయినా, లేదంటే ఎవరైనా కొట్టేసినా... ఇక ఆ ఫోన్ దొరకడం కల్ల అనుకుంటాం. కానీ, ఇప్పుడున్న టెక్నాలజీతోటి పోయిన ఫోన్లను కూడా ఇట్టే పట్టుకోవచ్చని నిరూపించారు బాలానగర్ పోలీసులు. సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటా... బాలానగర్ డివిజన్ పరిధిలో పోయిన 98 మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేసి శనివారం నాడు ఏసీపీ నరేష్ రెడ్డి తన ఆఫీసులనే బాధితులకు స్వయంగా అందజేశారు.

పోలీసులు ఫోన్లను ఎట్లా రికవరీ చేశారంటే:

స్టేషన్ల చుట్టూ తిరిగిన బాధితులు : బాలానగర్, అల్లాపూర్, కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ ఏరియాల్లో చాలామంది తమ సెల్‌ఫోన్లు పోగొట్టుకున్నామని ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సరికొత్త టెక్నాలజీని నమ్ముకున్నారు.

CEIR పోర్టల్ గమ్మత్తు : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన CEIR ఆన్‌లైన్ పోర్టల్‌ను వాడుకుంటా... పోయిన ఫోన్ల ఐఎంఈఐ (IMEI) నంబర్లను బ్లాక్ చేసి ట్రాకింగ్ లో పెట్టారు. ఆ ఫోన్లలో దొంగలు వేరే సిమ్ కార్డ్ వేయగానే పోలీసులకు సిగ్నల్స్ వచ్చేసినయి. అట్ల మొత్తం 98 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

ఏసీపీ నరేష్ రెడ్డి సలహా: జనాలు తమ ఫోన్లు పోగొట్టుకుంటే ఏమాత్రం ఆందోళన చెందొద్దని ఏసీపీ నరేష్ రెడ్డి  ధైర్యం చెప్పారు. వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి "సైబర్ హెల్ప్ డెస్క్" ను సంప్రదించి, CEIR పోర్టల్‌ల వివరాలు నమోదు చేస్తే సాంకేతిక పరిజ్ఞానంతో మీ ఫోన్‌ను మీకు సేఫ్‌గా అప్పగిస్తామని చెప్పారు.

సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వాడుకుంటా ఫోన్లను రికవరీ చేసిన బాలానగర్ సీఐ ప్రశాంత్, అల్లాపూర్ సీఐ నవీన్ కుమార్, కూకట్‌పల్లి సీఐ స్వామి గౌడ్, డీఐలు బానోత్ సక్రమ్, శేఖర్ రెడ్డి, క్రైమ్ టీమ్ ఏఎస్ఐ హనుమయ్య తో పాటు ఇతర సిబ్బందిని ఏసీపీ గట్టిగనే అభినందించారు.



Tags : తెలంగాణ, క్రైమ్, బాలానగర్, CEIR Portal, Phone Recovery, Live Telugu News