సదాశివపేట, న్యూస్ పేజ్
సదాశివపేట పట్టణ వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాల కోలాహలం కొనసాగుతోంది. ఇందులో భాగంగా పట్టణంలోని 8వ వార్డు పరిధిలో గల సాయి నగర్ కాలనీలో కొలువై ఉన్న సాయి గణేష్ మండపాన్ని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్ శ్రీనివాస్ గౌడ్ గురువారం దర్శించుకున్నారు. మండపంలో వేంచేసి ఉన్న విఘ్నేశ్వరుడికి ఆయన భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు మరియు హారతి కార్యక్రమాలను నిర్వహించారు.
పాడిపంటలతో రాష్ట్రం సస్యశ్యామలం కావాలి
పూజా కార్యక్రమాల అనంతరం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సాయి నగర్ కాలనీ ప్రజలతో పాటు సదాశివపేట పట్టణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, రైతాంగం సుఖసంతోషాలతో ఉండేలా, పాడిపంటలతో రాష్ట్రం ఎల్లప్పుడూ సస్యశ్యామలంగా వర్ధిల్లాలని ఆ విఘ్నేశ్వరుడిని మనస్ఫూర్తిగా ప్రార్థించినట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం సాయి గణేష్ మండపం కమిటీ నిర్వాహకులు శ్రీనివాస్ గౌడ్‌ను శాలువాతో ఘనంగా సత్కరించి, పూలమాలలు వేసి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.
ఈ ధార్మిక కార్యక్రమంలో కాలనీ పెద్దలు, భక్తులతో పాటు పరమేశ్వర చారి, శ్రీను చారి, దత్తు, భిక్షపతి, వినయ్ స్వామి, సంతు స్వామి, శేఖర్, ప్రభు చారి, అశోక్ చారి, చంద్రశేఖర్ మరియు కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Tags : Sadashivpet Sai Ganesh Pandal 2026, Srinivas Goud Ganesh Puja, Sadashivpet Municipal Updates, Newspage Regional News

మమ్మల్ని ఫాలో అవ్వండి