Ticker

6/recent/ticker-posts

Ad Code

జగ్గారెడ్డి సంచలనం.. 13 ఏళ్ల నిరీక్షణకు తెర, పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ!

  • జగ్గారెడ్డి కృషి తో భూములు కోల్పోయిన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ
  • ఇళ్ల స్థలాల పంపిణీ  పై గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాం లోనుండి కొనసాగుతున్న నిషేధం
  • జగ్గారెడ్డి కోరిక మేరకు తొగర్ పల్లిలో ఇళ్ల స్థలాల కేటాయింపు కోసం 
  • రాష్ట్రం లోనే మొట్టమొదటిసారిగా విడుదలైన జి.వో 
  • తొగర్‌పల్లి సర్వే నం.418లో 93 మంది లబ్ధిదారులకు 125 గజాల చొప్పున 
  • ఇంటి పట్టాలు పంపిణీ చేసిన నిర్మలా జగ్గారెడ్డి

sangareddy news photo

సంగారెడ్డి బ్యూరో, న్యూస్ పేజ్ :

ఏళ్ల తరబడి సొంతింటి స్థలం కోసం ఎదురుచూస్తున్న పేదల నిరీక్షణకు తెరపడింది. తొగర్‌పల్లి, అలియాబాద్‌ గ్రామాలకు చెందిన భూములు కోల్పోయిన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. తొగర్‌పల్లి సర్వే నంబర్‌ 418లో మొత్తం 93 మంది లబ్ధిదారులకు 125 గజాల చొప్పున స్థలాలను కేటాయిస్తూ పట్టాలు అందజేశారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో గతంలో ఇళ్ల స్థలాల కోసం పట్టాలు పొందినప్పటికీ, తదనంతర పరిణామాలతో లబ్ధిదారులకు స్థలాల పొజిషన్‌ అందకపోవడంతో సమస్య కొనసాగుతూ వచ్చింది. దీంతో తమకు కేటాయించిన స్థలాలను చూపించి, సొంతింటి కలను సాకారం చేయాలని లబ్ధిదారులు పలుమార్లు అధికారులను, ప్రజాప్రతినిధులను కోరుతూ వచ్చారు.

2011లో కేటాయింపులు.. ఆ తర్వాత నిలిచిన ప్రక్రియ

తొగర్‌పల్లి, అలియాబాద్‌ ప్రాంతాల్లో భూములు కోల్పోయిన కుటుంబాలకు గతంలో ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రక్రియ చేపట్టారు. అయితే ప్రభుత్వం మారిన అనంతరం గతంలో జరిగిన కేటాయింపులు అమలులోకి రాకపోవడంతో లబ్ధిదారులు స్థలాల కోసం సంవత్సరాల తరబడి ఎదురుచూడాల్సి వచ్చింది. ఈ సమస్యపై మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పలుమార్లు అసెంబ్లీలో ప్రస్తావించారు.

మంత్రి పొంగులేటిని కలిసిన జగ్గారెడ్డి

ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారం కోసం మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గత సంవత్సరం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కలిసి సమస్యను వివరించారు. అనంతరం మంత్రి అప్పటి సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ వల్లూరు క్రాంతికి ఫోన్‌ చేసి, లబ్ధిదారులకు పొజిషన్‌ చూపించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వెలువడిన తొలి జి వో

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత వచ్చిన బిఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ స్కీమ్ తెచ్చిన నేపథ్యం లో రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల స్థలాల కేటాయింపు పై నిషేధం విధించింది.  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం లో సైతం ఇళ్ల స్థలాల పై అదే నిషేధం కొనసాగుతూ వస్తోంది. జగ్గారెడ్డి విజ్ఞప్తి మేరకు గత 13 ఏళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్రం లో ఇళ్ల స్థలాల కేటాయింపు కోసం తొలి జీవో విడుదలైంది. 

నిర్మలా జగ్గారెడ్డి చేతుల మీదుగా పట్టాల పంపిణీ

తొగర్‌పల్లి సర్వే నంబర్‌ 418లో లబ్ధిదారులకు నిర్మలా జగ్గారెడ్డి చేతుల మీదుగా పట్టాలు పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల స్థలా కేటాయింపు పై 13 ఏళ్లుగా నిషేధం ఉన్నా జగ్గారెడ్డి కృషి తో తొగర్ పల్లి లో ఇళ్ల స్థలాల కు పట్టాలు మంజూరు చేయడం సాధ్యం అయిందని నిర్మలా జగ్గారెడ్డి, అధికారులు గుర్తు చేశారు. తొగర్ పల్లి గ్రామానికి చెందిన 72 మంది, అలియాబాద్ గ్రామానికి చెందిన 21 మంది రైతులకు ఈరోజు పట్టాలు పంపిణీ చేశారు 

ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్‌ ప్రభు, సీడీసీ చైర్మన్‌ రామ్‌రెడ్డి, నాయకులు నర్సింహా రెడ్డి, కొండాపూర్, అలియాబాద్ గ్రామ సర్పంచులు,కొండాపూర్‌ తహసీల్దార్‌ అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.