Ticker

6/recent/ticker-posts

Ad Code

ఓట్లు గల్లంతు అయిన వారిని తిరిగి చేర్చండి - ఎమ్మెల్యే మాధవరం

  • ఓటు హక్కుపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి 
  • డివిజన్ అధ్యక్షులు, సెక్రటరీలతో ఎమ్మెల్యే మాధవరం సమీక్షా సమావేశం.. 
  • ప్రభుత్వ విధానాలపై ఎమ్మెల్యే విమర్శలు


బాలానగర్, న్యూస్ పేజ్ :

కూకట్‌పల్లి నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ తమ ప్రాథమిక హక్కు అయిన ఓటు హక్కును కలిగి ఉండేలా ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు చొరవ చూపాలని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిలుపునిచ్చారు. గురువారం బాలానగర్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు మరియు సెక్రటరీలతో ఆయన ఒక ముఖ్య సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్ల నమోదు, అర్హులైన వారందరికీ ఓటు హక్కు కల్పించడంపై సుదీర్ఘంగా చర్చించారు.

ప్రభుత్వ నిర్ణయాలపై విమర్శలు

సమావేశంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని క్యాడర్‌కు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా 22A నిబంధన వల్ల ఎంతోమంది సామాన్య ప్రజలు తమ ఆస్తులను అమ్ముకోలేక, కొనుగోలు చేయలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూములను కాపాడే సాకుతో, జీవోల పేరుతో ప్రైవేట్ రిజిస్ట్రేషన్లను నిలిపివేయడం సరికాదన్నారు. దీనివల్ల ప్రజలకు ప్రయోజనం చేకూరడం లేదని, ఇది పూర్తిగా ఒక కుట్రపూరిత చర్యగా కనిపిస్తోందని విమర్శించారు.

బాధితులకు అండగా ఉంటాం

ప్రభుత్వం కనీస మానవతా దృక్పథం లేకుండా సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తోందని, ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటోందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ఈ 22A నిబంధనను సవరించి లేదా తొలగించి, రిజిస్ట్రేషన్ల ప్రక్రియను సులభతరం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్లు మందడి శ్రీనివాసరావు, సతీష్ గౌడ్, నిజాంపాల్, లీలా బాబురావు, ముద్దం నరసింహ యాదవ్, తూము శ్రావణ్ కుమార్, కాజావలి తదితర ముఖ్య నేతలు, డివిజన్ కమిటీల ప్రతినిధులు పాల్గొన్నారు.